calender_icon.png 1 February, 2026 | 5:36 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆటోను ఢీకొట్టిన కారు

01-02-2026 04:03:16 PM

కొండపాక: కారు ఆటోను ఢీకొట్టడంతో పలువురికి గాయాలైన సంఘటన తిమ్మారెడ్డిపల్లి రాజీవ్ రహదారిపై చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం సిద్దిపేటకు చెందిన గౌస్ తన సొంత పనిమీద ఆటోలో లకుడారం వెళ్లి తిరిగి వస్తుండగా తిమ్మారెడ్డిపల్లి రాజీవ్ రహదారిపై హైదరాబాదు నుండి వస్తున్న గుర్తు తెలియని కారు ఆటోను వెనక నుండి ఢీకొని, పక్కనే ఆగి ఉన్న మరొక బైకును ఢీకొని ఆపకుండా వెళ్లిపోయింది. ఈ ఘటనలో గౌస్ తలకు తీవ్ర గాయాలు కాగా, నాలుగు సంవత్సరాల పాప కు స్వల్ప గాయాలయ్యాయి. వెంటనే కొండపాక 108 అంబులెన్స్ సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకొని గాయపడిన వారికి ప్రథమ చికిత్స అందిస్తూ  సిద్దిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వీరిని ఢీకొన్న కారు వివరాలు తెలవాల్సి ఉంది.