24 August, 2026 | 12:39 AM

ఆస్ట్రేలియా ప్రతీకార విజయం

24-08-2026 12:06 AM

రెండో టెస్టులో బంగ్లాదేశ్ చిత్తు

ఒకటిన్నర రోజుల్లోనే మ్యాచ్ ఖతమ్

1- సిరీస్ సమం

మెక్ కే, ఆగష్టు 23: తొలి టెస్టులో అనూహ్యంగా బంగ్లాదేశ్ చేతిలో చావు దెబ్బ తిన్న ఆస్ట్రేలియా ప్రతీకారం తీర్చుకుంది. రెండో టెస్టులో బంగ్లాను ఇన్నింగ్స్51 పరుగుల తేడాతో చిత్తుగా ఓడించింది. ఆసీస్ స్టార్ పేసర్ మిచెల్ స్టార్క్  విధ్వంసకర బౌలింగ్ తో బంగ్లాదేశ్ కనీస పోటీ ఇవ్వలేకపోయింది. ఈ విజయంతో రెండు మ్యాచ్ల టెస్ట్ సిరీస్ ను ఆసీస్ 1-1తో సమం చేసింది.

బంగ్లాదేశ్ మొదటి ఇన్నింగ్స్ లో కేవలం 64 పరుగులకే కుప్పకూలింది. అనంతరం ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్లో కామెరాన్ గ్రీన్(67), స్టీవ్ స్మిత్(42) రాణించడంతో 210 పరుగులు చేసి 146 పరుగుల ఆధిక్యాన్ని సాధించింది. బంగ్లాదేశ్ హౌలర్ షోరిఫుల్ ఇస్లాం 7 వికెట్లతో రాణించాడు.మిచెల్ స్టార్క్ మెరుపు బౌలింగ్ కారణంగా బంగ్లాదేశ్ తమ రెండో ఇన్నింగ్స్లో 95 పరుగులకే కుప్పకూలింది. బంగ్లాదేశ్ తరఫున కెప్టెన్ నజ్ముల్ హొస్సేన్ శాంటో 31 పరుగులతో టాప్ స్కోరర్గా నిలిచాడు. తొమ్మిది మంది బ్యాటర్లలో ఎవరూ రెండంకెల స్కోరు చేయలేకపోయారు, వారిలో ముగ్గురు ఖాతా కూడా తెరవలేదు.మొదటి ఇన్నింగ్స్లో 6 వికెట్లు పడగొట్టి బంగ్లాదేశ్ బ్యాటింగ్ విభాగం నడ్డివిరిచిన స్టార్క్.. రెండో ఇన్నింగ్స్లోనూ అదే దాడిని కొనసాగించి మరో 4 వికెట్లు తీశాడు. మొత్తంగా ఈ మ్యాచ్ లో 10 వికెట్లు తీసి బంగ్లాదేశ్ను కోలుకోలేని దెబ్బతీశాడు. కెప్టెన్ పాట్ కమిన్స్, నాథన్ లియాన్ చెరో మూడు వికెట్లతో రాణించారు. స్టార్క్ కి

ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’, ’ప్లేయర్ ఆఫ్ ది సిరీస్’ అవార్డులు దక్కాయి.రెండు ఇన్నింగ్స్లు కలిపి బంగ్లాదేశ్ కేవలం 159 పరుగులు మాత్రమే చేయగలిగింది. సుదీర్ఘ ఫార్మాట్ చరిత్రలోనే ఇది అత్యల్ప మ్యాచ్ మొత్తం స్కోర్లలో ఒకటిగా నమోదైంది. కేవలం ఒకటిన్నర రోజుల్లోనే ఈ మ్యాచ్ ముగిసింది.పేస్కు అనుకూలించిన ప్పి ఆస్ట్రేలియా బౌలర్లు పూర్తి ఆధిపత్యం ప్రదర్శించడంతో ఈ మ్యాచ్ రెండో రోజు రెండో సెషన్లోనే ముగిసింది.