30 March, 2026 | 5:16 PM

అర్జీలపై అధికారులు వెంటనే స్పందించాలి

30-03-2026 03:34 PM

నిర్మల్,(విజయక్రాంతి): ప్రతి సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ప్రజలు సమస్యల పరిష్కారం కోసం వచ్చిన అర్జీలను సత్వరం పరిష్కరించాలని అడిషనల్ కలెక్టర్లు కిషోర్ కుమార్ వెంకటేశ్వర్లు అన్నారు. సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయం ప్రజావాణి నిర్వహించి దరఖాస్తులు స్వీకరించారు. ఎక్కువ సమస్యలు భూ సమస్యలు ఇందిరమ్మ ఇండ్లు వస్తున్నాయని వాటిపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్డిఓ రత్న కళ్యాణి అధికారులు ఉన్నారు.