11 July, 2026 | 5:06 PM

పొనకల్‌లో సర్వే శిబిరం

11-07-2026 03:47 PM

జన్నారం,(విజయక్రాంతి): మంచిర్యాల జిల్లా జన్నారం మండలం పోనకల్ గ్రామపంచాయతీ కార్యాలయంలో శని వారం ప్రత్యేకంగా సర్ సర్వే క్యాంప్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ జక్కు సుష్మా భూమేష్ ముఖ్య అతిథిగా పాల్గొని గ్రామానికి చెందిన ఓటర్లకు సర్ పై అవగాహన కల్పించారు. ఓటర్లకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా సిబ్బందినీ ఏర్పాటు చేసి ఫారంలను నింపి బీఎల్ఓలకు అందజేసి ఆన్ లైన్ చేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్‌తో పాటు ఉప సర్పంచ్, వార్డు సభ్యులు, పంచాయతీ కార్యదర్శి రాహుల్, బిల్ కలెక్టర్ అనిల్ కుమార్, గ్రామపంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.