27 June, 2026 | 7:31 PM

Breaking News

నిజామాబాద్ జీపీవోపై గ్రామస్తుల ఫిర్యాదు   •   నిరుపేదల సంక్షేమమే తెలంగాణ ప్రభుత్వ ముఖ్య లక్ష్యం   •   క్యూబాపై అమెరికా ఆంక్షలు ఎత్తివేయాలి   •   సోనాల మండల కేంద్రంలో పబ్లిక్ స్కూల్ ఏర్పాటు చేయండి   •   మొక్కలు నాటడం మున్సిపాలిటీ వంతు.. రక్షణ దేవుడి వంతు   •   జిల్లా బిజెపి (ఓబీసీ) రూరల్ అధ్యక్షులుగా మహేందర్ యాదవ్ ఎన్నిక   •   అంబర్పేటలో ఘనంగా డాక్టర్ గునిగంటి ప్రభాకర్ రావు జన్మదిన వేడుకలు   •   గురుకుల పాఠశాలను తనిఖీ చేసిన ప్రత్యేక అధికారి   •   అరకొర వసతుల మధ్య సాంఘిక సంక్షేమ హాస్టల్ భవనాన్ని చూసి హాస్టల్లో రామంటున్న విద్యార్థులు   •   విద్యార్థుల జీవితాలతో కేంద్ర ప్రభుత్వం చెలగాటమాడుతోంది   •  

మన్సూరాబాద్ పెద్ద చెరువును కాపాడాలి

16-05-2025 11:08 PM

మురుగునీరు చేరకుండా చర్యలు తీసుకోవాలి

కార్పొరేటర్ కొప్పుల నర్సింహరెడ్డి 

ఎల్బీనగర్: మన్సూరాబాద్ పెద్ద చెరువులో మురుగునీరు కలవకుండా అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టాని కార్పొరేటర్  కొప్పుల నర్సింహరెడ్డి కోరారు. గురువారం రాత్రి కురిసిన వర్షానికి మన్సూరాబాద్ పెద్ద చెరువులోకి మురుగునీరు చేరుతుందని తెలుసుకుని పరిశీలించారు. చెరువులోకి మురుగునీరు  చేరుతుందని జలమండలి అధికారులకు  కార్పొరేటర్ కొప్పుల నర్సింహ రెడ్డి సమాచారం ఇచ్చారు.

ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ... ఏడేండ్ల  క్రితం చింతలకుంట అండర్ పాస్ రోడ్డులో వర్షపు నీరు నిల్వకుండా ప్రత్యేకంగా ఎస్ఎన్ ఆర్ అపార్ట్మెంట్ రోడ్డు మార్గం నుంచి పెద్ద చెరువులోకి వర్షపు నీటి పైప్ లైన్ వేశారని, ఈ పైప్ లైన్ కు సివరేజ్ లైన్లు కనెక్షన్ చేశారని తెలిపారు. సీవరేజ్ పైప్ లైన్లు కనెక్షన్ ఇచ్చినవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, మన్సూరాబాద్ పెద్ద చెరువు కలుషితం కాకుండా ప్రత్యేక చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో స్థానిక నాయకులు శేఖర్ రెడ్డి, వేమన్ రెడ్డి, జైపాల్ రెడ్డి, బీజేపీ నాయకులు మొరిశెట్టి సంతోష్, కవితా రెడ్డి పాల్గొన్నారు.