15 April, 2026 | 11:03 AM

తాగునీటి సమస్య తలెత్తకుండా చర్యలు

17-05-2025 12:00 AM

ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులతో కలెక్టర్ రాజర్షి షా సమీక్ష

ఆదిలాబాద్, మే 16 (విజయక్రాంతి): వేసవిలో గ్రామాల్లో త్రాగునీటి సరఫరాలో సమస్య తలెత్తకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని, ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ రాజర్షి షా ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులను ఆదేశించారు. కలెక్టర్ తన ఛాంబర్లో శుక్రవారం ఈఈ, డీఈఈలతో వేసవిలో నీటి సరఫరా పనుల పురోగతిని సమీక్షించారు.

ఈ సందర్భంగా 24 పనులు మంజూరు కాగా, 5 పనులు పూర్తయ్యాయ ని, 11 పనులు పురోగతిలో ఉన్నాయని, 8 పనులు ప్రారంభం కాలేదని మిషన్  భగీరథ ఈఈ చంద్ర మోహన్ కలెక్టర్‌కు వివరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడు తూ వేసవి కాలం నేపథ్యంలో ప్రజలకు తా గునీరు సరఫరాలో ఆటంకం కలగకుండా చూసుకోవాలని, అవసరం ఉన్నచోట స్థాని క వాటర్ సోర్సెస్లను వాటర్ ట్యాంకర్లను వినియోగించు కోవాలన్నారు.

మిషన్ భగీరథ, పంచాయితీ రాజ్ శాఖ అధికారులు సమన్వయంతో పని చేయాలని, పైప్ లైన్లు డ్యామేజ్ కాకుండా చర్యలు తీసుకోవాలని, నీరువృధా కాకుండా చూసుకోవాలన్నారు. ఈ సందర్భంగా జీపీల వారీగా  ఎక్కడెక్కడ విద్యుత్ అసౌకర్యం, భగీరథ నీటి సమస్యలు ఉన్నాయో అడిగి తెలుసుకొని సమస్య ఉన్న చోట నీటి సరఫరా ట్యాంకర్లతో ప్రత్యామ్నా య ఏర్పాట్లు చేయాలన్నారు.

పైప్ లైన్ డ్యామేజ్ అయితే వెంటనే మరమత్తులు చేపట్టాలని, సీసీ రోడ్లు వలన పైప్‌లైన్లు డ్యామేజ్ అయినా వాటికి సంబంధించి తగు చర్యలు చేపట్టాలని సూచించారు. ఇంట్రా, గ్రిడ్, పంచాయితి, ఆర్‌డబ్ల్యూఎస్  అధికారులను వారి వారి ప్రోగ్రెస్ ను కలెక్టర్ కు తెలిపారు. ఈ సమీక్ష సమావేశంలో ఈఈ చంద్రమోహన్ ఆర్‌డబ్ల్యూఎస్ డిఈ, ఏఈ తదితరులు పాల్గొన్నారు.