ఆటో డ్రైవర్ అదృశ్యం: భార్య ఫిర్యాదుతో కేసు నమోదు
12-06-2026 08:46 PM
చేగుంట,(విజయక్రాంతి): మెదక్ జిల్లా, చేగుంట మండలం, దౌల్తాబాద్ మండలం సూరంపల్లి గ్రామానికి చెందిన పాములపర్తి స్వామి (45) ఆటో డ్రైవర్ అదృశ్యమైనట్లు చేగుంట పోలీసులు తెలిపారు. పోలీసుల వివరాల ప్రకారం.. సూరంపల్లి గ్రామానికి చెందిన స్వామి ఈ నెల 11వ తేదీన (గురువారం) చేగుంటకు వచ్చాడు. తన బంధువుల ఇంటి వద్ద ఆటోను ఉంచి వెల్లిపోయాడు,ఎటో వెళ్లిపోయాడు.ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు, బంధువులు, తెలిసిన వారి వద్ద ఎంత వెతికిన ఫలితం లేకపోవడంతో,భార్య పాములపర్తి రజిత చేగుంట పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు చేగుంట ఎస్ఐ చైతన్య కుమార్ రెడ్డి కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.






