13 July, 2026 | 9:39 PM

Breaking News

ఫేక్ ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్తో పట్టా మార్పిడిపై విచారణ అధికారిగా ఆర్డీవో మధు   •   నులిపురుగుల నివారణ మాత్రలు తప్పక వేయించాలి   •   వైటీసీ ద్వారా నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించాలి   •   జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవ సందర్బంగా ఆల్బండజోలు మాత్రలు పంపిణి   •   పదోన్నతిపై బదిలీ అయిన పోస్టల్ ఉద్యోగులకు ఘనంగా సన్మానం   •   విద్యార్థినీల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవు   •   ప్రజావాణి దరఖాస్తులు క్షేత్రస్థాయిలోకి వెళ్లి పరిష్కరించాలి   •   లక్క పురుగుతో ఇబ్బందులు పడుతుంటే అధికారులు నిద్రపోతున్నారా..?   •   వైటీపీఎస్ టెండర్లను రద్దు చేయాలి   •   రహదారి నిర్మాణం చేప‌ట్టాల‌ని వినతి   •  

శ్రీ కాళేశ్వర ముక్తేశ్వర దేవస్థానం చైర్మన్ గా అవధాని మోహన్ శర్మ

31-03-2026 07:38 PM

నూతన పాలక మండలిని ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ

మంథని,(విజయక్రాంతి): పవిత్ర పుణ్యక్షేత్రమైన శ్రీ కాళేశ్వర ముక్తేశ్వర స్వామి ఆలయ ధర్మకర్తల మండలి నూతన పాలకవర్గ అధ్యక్షులుగా అవధాని మోహన్ శర్మ ను నియమిస్తూ రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు. మోహన్ శర్మ గతంలో 2015లో ఒక సంవత్సరం పాటు పాలక మండలి అధ్యక్షులుగా సేవలందించారు. అలాగే శ్రీ సరస్వతి పుష్కరాల సమయంలో 15-5-2015 నుండి 26-5-2025 వరకు పుష్కరాల కమిటీ అధ్యక్షులుగా సైతం సేవలందించారు.

అలాగే రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న సరస్వతి అంత్య పుష్కరాలకు మే 22-5-26 వరకు చైర్మన్  నియమించింది. గతంలో సంవత్సర కాలం మాత్రమే పాలకమండలి ఉండేది. అలాగే 2027 మేలో వచ్చే గోదావరి పుష్కరాల వరకు మోహన్ శర్మనే అధ్యక్షులుగా ఉంటారు.  ప్రస్తుతం పాలకమండలి  పరిమితిని రెండు సంవత్సరాలుగా నిర్ణయిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

ఈ సందర్భంగా మోహన్ శర్మ మాట్లాడుతూ... స్వామివారి సేవ చేసే భాగ్యం కలిగినందుకు ఎంతో ఆనందంగా ఉందన్నారు. ముఖ్యంగా తనకు స్వామి వారికి సేవ చేసే భాగ్యం కలిగించిన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, దేవాలయ శాఖ మంత్రి కొండ సురేఖలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. పాలకవర్గం సభ్యులుగా మంచినీళ్ల దుర్గయ్య, జలివంచ సీతారాం, సుంకరి సీతయ్య, గండెసిరి సత్యనారాయణ, కుంభం పద్మ, బీసుని నరసయ్య,  అడ్డూరి శ్రీధర్ రావు, కాటం సత్యం, దొడ్ల అశోక్, దేవర శ్యాంసుందర్ లను నియమిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి.