మద్యం సేవించి వాహనాలు నడిపితే కఠిన చర్యలు
31-03-2026 07:35 PM
సుల్తానాబాద్ ఎస్సై చంద్రకుమార్
సుల్తానాబాద్,(విజయక్రాంతి): మద్యం సేవించి వాహనాలు నడిపితే కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని సుల్తానాబాద్ ఎస్సై చంద్రకుమార్ అన్నారు, పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణంలోని పాత జెండా వద్ద మంగళవారం రాత్రి వాహనాల తనికి నిర్వహించారు. ఈ సందర్భం గా డ్రంక్ అండ్ డ్రైవ్ కార్యక్రమాన్ని చేపట్టారు, మద్యం సేవించి వాహనాలు నడపవద్దని వాహనదారులకు సూచించారు. ప్రతి వాహనదారుడు తప్పనిసరిగా వాహనాలకు సంబంధించి పేపర్స్ ఉండాలని, లేకుంటే కేసులు నమోదు చేయడం జరుగుతుందని ఎస్ఐ చంద్రకుమార్ తెలిపారు.




