25 June, 2026 | 7:46 AM

ఎక్సైజ్ ఏడీగా అవినాశ్ మహంతి

02-05-2026 02:07 AM

ఆబ్కారీ భవన్‌లో బాధ్యతలు స్వీకరణ

హైదరాబాద్, మే 1 (విజయక్రాంతి): ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్‌గా అవినాశ్ మహంతి శుక్రవారం ఎక్సైజ్  భవన్‌లో పదవి బాధ్యతలు చేపట్టా రు. పదవి బాధ్యతలు చేపట్టడానికి వచ్చిన మహంతికి ఎన్‌ఫోర్స్‌మెంట్ జాయింట్ డైరెక్టర్ అంజన్‌రావు, ఎస్టీఎఫ్ టీమ్‌లు, సిబ్బం ది స్వాగతం పలికి సన్మానించారు. ఎన్‌ఫోర్స్‌మెంట్ అసిస్టెంట్ కమిషనర్ ప్రణవీ, ఎస్టీఎఫ్ టీమ్ అడిషనల్ ఎస్పీ వెంకటేశ్వరబాబు, డీఎస్పీ తిరుపతి యాదవ్, టీమ్ బీ లీడర్ ప్రదీప్‌రావును డైరెక్టర్ మహంతికి జేసీ అంజన్‌రావు పరిచయం చేశారు. హైదరాబాద్, రంగారెడ్డి డిప్యూటి కమిషనర్లు అనిల్ కుమార్‌రెడ్డి, పి.దశరథ్, అసిస్టెంట్ కమిషనర్ ఆర్.కిషన్, సరూర్ నగర్, హైదరాబాద్ ఎక్సైజ్ సూపరింటెండ్లు ఉజ్వలరెడ్డి, పంచాక్షరీ డైరెక్టర్‌ను కలిసిన వారిలో ఉన్నారు.