2 May, 2026 | 2:36 AM

యువ జర్నలిస్టు ఆత్మహత్య

02-05-2026 02:05 AM

పోరండ్లలో విషాదఛాయలు 

సంతాపం తెలిపిన ఎంపీ, ఎమ్మెల్యే

మానకొండూరు,మే 1 (విజయక్రాంతి): కరీంనగర్ జిల్లా మానకొండూరు నియోజకవర్గ లోని తిమ్మాపూర్ మండలానికి చెందిన దినపత్రిక విలేఖరి బొజ్జ  రాజ్ కుమార్ (32) శుక్రవారం ఎల్‌ఎండి లోని చెరువులో దూకి ఆత్మహత్యకు పాల్పడడం మండలంలో తీవ్ర విషాదం నింపింది. తిమ్మాపూర్ మండలంలోని పోరండ్ల గ్రామం రాజకుమార్ స్వస్థలం. ఆత్మహత్య గల కారణాలు తెలియ రాలేదు.

కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్, మానకొండూరు ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ రాజ్ కుమార్ మృతి పట్ల తమ తీవ్ర దిగ్భంత్రి ని, సంతాపాన్ని ప్రకటించారు. చాలా చిన్న వయసులోనే అర్ధాంతరంగా తనువు చాలించడం పట్ల వారు తమ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఎంతో ఉజ్వల భవిష్యత్తు అందుకోవలసిన రాజ్ కుమార్ పిన్న వయసులోనే మృతి చెందడం విచారకరమన్నారు.