25-05-2025 04:45:25 PM
సారంగాపూర్ (విజయక్రాంతి): మండలంలో ప్రసిద్ధిగాంచిన అడెల్లి పోచమ్మని రాష్ట్ర విత్తనాభివృద్దీ శాఖ చైర్మెన్ అవినాష్ రెడ్డి(Avinash Reddy) ఆదివారం దర్శించుకున్నారు. ప్రతీ సంవత్సరం మిరుగు చేరువ సమయంలో పోచమ్మని కుటుంబ సమేతంగా తప్పకుండా దర్శించుకుంటామని, రైతులు ఏలాంటి కష్ట నష్టాలు లేకుండా లాభ దాయలతో ఎల్లప్పుడూ సుఖంగా ఆరోగ్యవంతంగా ఉంచమని పోచమ్మని వేడుకున్నామని తెలిపారు. ఆనంతరం ఆలయ చైర్మెన్ సింగం భోజ గౌడ్, ధర్మ కర్తలు కలిసి అవినాష్ రెడ్డి దంపతులకు శాలువాతో సన్మానించారు. ఆయన వెంట మాజీ జెడ్పీటీసీ సభ్యుడు పత్తి రెడ్డి రాజేశ్వర్ రెడ్డి, ఐరా నారాయణ రెడ్డి, అహ్మద్ ముక్తార్, పార్టీ నాయకులు, తదితరులు ఉన్నారు.