calender_icon.png 25 May, 2025 | 7:23 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రధాని మోదీ మన్ కీ బాత్ వీక్షించిన భాజపా నేతలు

25-05-2025 04:55:27 PM

మణికొండ: మణికొండ మున్సిపాలిటీలోని భారతీయ జనతా పార్టీ శాఖ ఆఫీస్ లో ప్రధానమంత్రి నరేంద్రమోదీ(Prime Minister Narendra Modi) 122వ మనకి బాత్ కార్యక్రమాన్ని వీక్షించారు. మన్ కీ బాత్(Mann Ki Baat) లో ప్రధాని మోదీ ఆధునిక యుద్ధ నైపుణ్యం, సింధూర్ మన సైనికులు విజయాన్ని అందించినందుకు శుభాకాంక్షలు తెలియజేశారు. వ్యవసాయ పద్ధతులను, డ్రోన్ల ద్వారా సాగు చేసే విధానం, అలాగే జూన్ 21న నేషనల్ యోగా డే సందర్భంగా ప్రతి ఒక్కరూ యోగాను దినచర్యలో భాగంగా అలవాటు చేసుకోవాల్సిందిగా చెప్పారు.

మన దేశంలో తయారైన వస్తువులు, బొమ్మలు మనవాళ్లు కొనే విధంగా అలవాటు చేసుకోవాలని స్ఫూర్తివంతమైన సందేశాన్ని మోదీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మణికొండ మున్సిపాలిటీ మాజీ  వైస్ చైర్మన్ కొండకల నరేందర్ రెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు టి. అంజన్ కుమార్ గౌడ్, మణికొండ మున్సిపాలిటీ అధ్యక్షులు బి. రవికాంత్ రెడ్డి, రంగారెడ్డి జిల్లా కౌన్సిల్ మెంబర్స్ సి. బీరప్ప, మాజీ ఎంపీటీసీ ఎం. రాఘవరెడ్డి, పకనాటి సత్యనారాయణ, ఓబీసీ మోర్చా కార్యవర్గ సభ్యులు బి. శివకుమార్, మాజీ వార్డ్ మెంబర్  డి. రాజేష్, తదితరులు పాల్గొన్నారు.