25-05-2025 04:40:40 PM
మహబూబాబాద్ (విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లా(Mahabubabad District) నెల్లికుదురు మండలం నర్సింహుల గూడెం కోరగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవాలయంలో వెండి విగ్రహాన్ని దొంగలు ఎత్తుకెళ్లారు. ఆదివారం ఆలయ అర్చకుడు దేవుడి విగ్రహం చోరికి గురైన విషయాన్ని గుర్తించి వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. సంఘటన స్థలిని నెల్లికుదురు ఎస్ఐ చిర్రా రమేష్ బాబు సందర్శించి దర్యాప్తు చేపట్టారు. కేజీ బరువు ఉన్న వెండి విగ్రహం అపహరణకు గురైనట్లు ఎస్సై తెలిపారు. గతంలో కూడా దేవాలయంలో వెండి వస్తువులు అపహరణకు గురయ్యాయని, ఆలయ కమిటీ ఆధ్వర్యంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి దేవాలయానికి రక్షణ కల్పించాలని ప్రజలు కోరుతున్నారు.