27 July, 2026 | 6:07 PM

Breaking News

ఐదెకరాల ప్రభుత్వ భూమి కబ్జా..   •   బీజిలిపూర్ ఎస్సీకాలనీ కరెంట్ సమస్య పరిష్కరించరా?   •   అర్హులందరికీ ఓటు హక్కు కల్పించాలి: ఎమ్మెల్యే కోరం కనకయ్య   •   భాగీరథిపల్లిలో రూ.25 లక్షల కల్వర్టు నిర్మాణానికి భూమిపూజ   •   ఇల్లందు ఏరియాలో సింగరేణి ఉద్యోగులకు క్వార్టర్ల కౌన్సిలింగ్ నిర్వహణ   •   నేరేడుచర్లలో భాజపా ఆధ్వర్యంలో " సర్" ప్రక్రియపై సమీక్ష   •   రైతులు ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి సారించాలి   •   ఎక్స్‌టార్షన్‌కు పాల్పడిన నిందితులు అరెస్ట్.. రిమాండ్   •   తొలిముద్ద కార్యక్రమాన్ని ప్రారంభించిన కార్పొరేటర్ కంచర్ల హిమశ్రీ   •   ప్రభుత్వ, ఆశ్రమ పాఠశాలల్లో సౌకర్యాలు కల్పించాలి   •  

నిమ్స్‌లో ఫిజియోథెరపీ విభాగానికి పురస్కారం

08-04-2026 12:30 AM

పంజాగుట్ట, ఏప్రిల్ 7(విజయక్రాంతి): నిజాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఫిజియోథెరపీ విభాగం మరో అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. రోగులకు నాణ్యమైన ఆరోగ్య సేవలు అందించడంలో చూపుతున్న అంకితభావానికి గుర్తింపుగా తెలంగాణ ప్రభుత్వం ఈ విభాగానికి ప్రతిష్టాత్మకమైన ఉత్తమ సేవ పురస్కారం-2026ను ప్రకటించింది. మంగళవారం హైదరాబాద్లోని రవీంద్రభారతి ఆడిటోరియంలో నిర్వ హించిన ప్రజా పాలన  ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా ఈ అవార్డును ప్రదానం చేశారు.

ఈ అవార్డు ప్రదానోత్సవ కార్యక్రమంలో మంత్రి దామోదర రాజ నరసింహ, ఆరోగ్యశాఖ ప్రధాన కార్యదర్శి క్రిస్టినా జడ్. చోంగ్తు, నిమ్స్ డైరెక్టర్ ప్రొఫెసర్ నగరి బీరప్ప తదితర ప్రముఖులు పాల్గొన్నారు. ఫిజియో థెరపీ విభాగానికి చెందిన వైద్యులు డాక్టర్ నాగ శ్రవణ కుమార్ జంప, డాక్టర్ నవీన్ కుమార్ బల్నే, డాక్టర్ సునీత్ వాఘ్రాయ్, డాక్టర్ ప్రవీణ్ డౌలే మరియు డాక్టర్ లక్ష్మణ ప్రసాద్ గడ్డేలు మంత్రి చేతుల మీదుగా ఈ పురస్కారాన్ని అందుకున్నారు. ఈ పురస్కారం విభాగంలోని వైద్యులకు, సిబ్బందికి మరింత ఉత్సాహాన్నిస్తుందని ఆయన పేర్కొన్నారు.