16 May, 2026 | 9:20 PM

నమ్మిస్తారు ఖాతా ఖాళీ చేస్తారు.. తస్మాత్ జాగ్రత్త : డిఐ మాన్సింగ్

16-05-2026 08:38 PM

ఉప్పల్,(విజయక్రాంతి): డబ్బు ఆశ చూపించి నమ్మే విధంగా మాటలు మాట్లాడుతూ సైబర్ నేరగాళ్లు ఖాతాను ఖాళీ చేస్తారని అట్టి అపరిచిత వ్యక్తుల చరవాణి కాల్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలని నాచారం డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ మాన్సింగ్ అన్నారు. నాచారం పోలీస్ స్టేషన్ పరిధిలోని స్నేహపురి కాలనీలో ఎస్సై ఫ్రాన్సిస్ తో కలిసి సైబర్ నేరల పట్ల అవగాహన సదస్సును ఆయన ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సైబర్ నేరాల పట్ల ప్రతి ఒక్కరూ అవగాహన పెంచుకొని నేర రహిత సమాజం కోసం కృషి చేయాలని ఆయన సూచించారు.

సైబర్ మోసాలపై ఇంట్లో చర్చించి ఇంట్లోని పెద్దలకు సైబర్ నగరాల గురించి వివరించాలని ఆయన కోరారు. అనుమానితుల కాల్ చేస్తే బ్యాంకు వివరాలు తదితర వాటిని తెలియజేయవద్దని ఆయన తెలిపారు ఫోన్లోని ఓటీపి ఓఎల్ఎక్స్ పేటియం ఫోన్ పే గూగుల్ పే ఈ కేవైసీ అప్డేట్ వివరాలు అడిగితే చెప్పకూడదని ఆయన సూచించారు సైబర్ నేరాలకు గురైనప్పుడు  టోల్ ఫ్రీ 1930 నెంబర్ కు వెంటనే ఫిర్యాదు చేయాలని ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో నాచారం ఏఎస్ఐ ఈదయ్య పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు