01-01-2026 12:51:58 AM
శ్వాస ఫౌండేషన్ డాక్టర్ విష్ణున్‌రావు వీరపనేని సదస్సు
హైదరాబాద్, డిసెంబర్ 31 (విజయక్రాంతి): హైదరాబాద్ నారాయణగూడలోని శ్వాస హాస్పిటల్ చైర్మన్, శ్వాస పౌండేషన్ ఫౌండర్ డాక్టర్ విష్ణున్ రావు వీరపనేని ఆధ్వర్యంలో ప్రజలకు, పీజీ మెడికల్ విద్యార్థుల కు, ప్రాక్టీసింగ్ డాకర్స్‌కు అలర్జీపై ప్రత్యేక కార్యక్రమం ద్వారా అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. ‘అలర్జీ పసి వయసులో మొదలై పండు ముదుసలి వరకు వ్యాపిస్తుంది. ముక్కుల్లో, ఊపిటితిత్తుల్లో, చర్మంలో, జాయింట్లలో, పేగుల్లో నరనరాల్లో ఎక్కడైనా వేరు వేరు రూపాల్లో కనిపిస్తుంది.
చర్మంలో వుంటే దురదల రూపంలో దద్దుర్ల రూపంలో కనిపిస్తుంది. కళ్ళలో అలర్జీ వుంటే కళ్లు ఎర్రగా మారడం, దురదలు పెట్టడం, కంటి చూపు మందగించడం జరగొచ్చు. గురకకు, ఊబకాయానికి సమస్యకు మూల కారణం అలర్జీ ఆస్తమా కావచ్చు. మూలాన్ని గుర్తించనంత వరకు వారికి ఏ వైద్యం చేసినా ఉపశమనం లభించదు. ఎంతకీ తగ్గని అలర్జీ ఆస్తమా కారణంగా కొందరు మహిళల్లో గర్భం దాల్చడం అనేది ఆలస్యమౌతుంది. పిల్లల్లో హైపర్ యాక్టివ్, ఆటిజం వంటి సమస్యలను నివారించవచ్చు.
ఇంటర్ డిసిప్లినరీ ఇంటరాక్టివ్ అలర్జీ సొల్యూషన్స్, ఐడియాస్ అంటే అలర్జీ శరీరంలో ఏ భాగంలో వున్నా అది ఏ రూపంలో వున్నా దాని మూలాన్ని గుర్తించి వైద్యం అందించడం, అంటే ట్రీట్ ది రూట్ నాట్ ది ఫ్రూట్. సమస్య ఎక్కడ వుందో అన్ని పరీక్షల ద్వారా తెలుకుని అక్కడే వైద్యం చేయాలి. ఈ విషయాన్ని శ్వాస ఫౌండేషన్ ద్వారా అలర్జీ ఆస్తమా బాధితులకి, వారి కుటుంబాలకి, ప్రజలకి అవగాహన కల్పించేందుకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించాం’ అని చెప్పారు. కార్యక్రమంలో శిరీష రాఘవేంద్ర ఐపీఎస్, తెలంగాణ రాష్ట్ర పిల్లల విభాగ రాష్ట్ర అధ్యక్షులు డా గడగోజు భాస్క ర్, నీలోఫర్ హాస్పిటల్ సూపరింటెండెంట్ ప్రొఫెసర్ డా జి. విజయకుమార్, ప్రొఫెసర్ డా రమేష్, డా నిర్మల, డా శ్రీకాంత్ పాల్గొన్నారు.