calender_icon.png 17 July, 2025 | 11:47 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సికిల్ సెల్ అనీమియాపై అవగాహన ఉండాలి

17-07-2025 12:52:08 AM

హెల్త్ ఎడ్యుకేటర్ అల్లాడి శ్రీనివాస్

లక్షేట్టిపేట, జూలై 16:  సికిల్ సెల్ అనీమియాపై గిరిజనులు అవగాహన కలిగి ఉండా లని హెల్త్ ఎడ్యుకేటర్ అల్లాడి శ్రీనివాస్ అన్నారు. బుధవారం పట్టణంలోని గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలలో సికిల్ సెల్ అనీమియాపై ప్రత్యేక అవగాహన కార్యక్రమంలో హెల్త్ ఎడ్యుకేటర్ అల్లాడి శ్రీనివాస్, సబ్ యూనిట్ అధికారి నాందేవ్ లు ఫెసిలిటేటర్లుగా హాజరై విద్యార్థులకు సికిల్ సెల్ అనీమియా రుగ్మత గురించి  వివరించారు.

అన్ని గిరిజన పాఠశాలల్లో సికిల్ సెల్ అనీమియా నిర్దారణ కోసం రక్త పరీక్షల శిబి రాలు నిర్వహిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో వెంకట్రావు పేట  వైద్యాధికారి డాక్ట  సతీష్, గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాల ప్రధానోపాధ్యాయులు సత్యనారాయణ, హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ మల్లారెడ్డి, ఏఎన్‌ఎంలు సుజాత, సుమిత్ర, హెల్త్ అసిస్టెంట్ గఫూర్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.