calender_icon.png 17 July, 2025 | 3:33 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గురుకుల పాఠశాలలో ఘనంగా బోనాలు

17-07-2025 12:53:13 AM

కుమ్రంభీంఆసిఫాబాద్, జూలై16 (విజ య క్రాంతి): ఆషాఢమాసం పురస్కరించుకొ ని ఆసిఫాబాద్ మండలం బాబాపూర్‌లోని మహాత్మ జ్యోతిబాపూలే బాలికల గురుకుల పాఠశాలలో బుధవారం బోనాల పండుగ వేడుకలను ఘనంగా నిర్వహించారు.

విద్యార్థినిలు తెలంగాణ సాంప్రదాయ దుస్తులను ధరించి అమ్మవారికి బోనం సమర్పించారు. వేడుకల సందర్భంగా విద్యార్థులు ఎంతో ఉత్సాహంగా నృత్యాలు చేశారు.ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ సుకన్య, ఉపాధ్యా యురాలు, సిబ్బంది పాల్గొన్నారు.