28 August, 2026 | 2:05 PM

Breaking News

జర్నలిస్టులకు రాఖీ కట్టి.. హెల్మెట్లు అందించిన మాజీ మంత్రి సత్యవతి రాథోడ్   •   రక్షాబంధన్‌ పండుగ.. మన బంధాలకు ప్రతీక: ఎమ్మెల్యే పాయల్‌ శంకర్   •   బసవరాజు శ్రీనివాస్ పై నీలాప నిందలు మానేయండి   •   సీఐ అత్యుత్సాహం.. ఆందోళనకారులపై దాడి   •   శిశుమందిర్ విద్యార్థుల సౌభ్రాతృత్వ సందేశం   •   ముత్తారం మాజీ జడ్పీటీసీని పరామర్శించిన కాంగ్రెస్ నాయకులు   •   కిక్కిరిసిన బస్సులు.. కిటకిటలాడుతున్న బస్టాండ్లు   •   మాజీ మంత్రి కోట్నాక భీంరావు వర్ధంతిని విజయవంతం చేయాలి   •   జర్నలిస్టులకు రాఖీ కట్టిన ఎస్సై గుగులోత్ శ్రీదేవి   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం మహాధర్నా   •  

హెల్మెట్ ప్రాముఖ్యతపై అవగాహన

25-06-2026 01:55 AM

వనపర్తి టౌన్  జూన్ 24: రోడ్డు ప్రమాదాల నివారణలో భాగంగా హెల్మెట్ వినియోగంపై అవగాహన కల్పించేందుకు ఆర్టీవో కార్యాలయం వద్ద బుధవారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా  డీటీవో సురేష్ కుమార్ మాట్లాడుతూ ద్విచక్ర వాహనదారుల ప్రాణ రక్షణలో హెల్మెట్ కీలక పాత్ర పోషిస్తుందని తెలిపారు. ప్రమాదాలు ఎప్పుడు, ఎలా జరుగుతాయో ఊహించలేమని, ప్రమాద సమయంలో తలకు తీవ్రమైన గాయాలు కాకుండా హెల్మెట్ రక్షణ కల్పిస్తుందని పేర్కొన్నారు.

హెల్మెట్ ధరించడం వల్ల తలకు గాయాలు అయ్యే ప్రమాదం గణనీయంగా తగ్గడంతో పాటు ప్రాణనష్టం జరిగే అవకాశాలు కూడా తగ్గుతాయని వివరించారు.ద్విచక్ర వాహనం నడిపే ప్రతి ఒక్కరూ నాణ్యమైన ఐఎస్‌ఐ మార్క్ కలిగిన హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని సూచించారు. హెల్మెట్ స్ట్రాప్ను బిగించుకోవాలని, డ్రైవర్తో పాటు వెనుక కూర్చునే వ్యక్తి కూడా హెల్మెట్ ధరించాలని తెలిపారు.దుమ్ము, వర్షం, గాలి, ఇతర ఇబ్బందుల నుంచి హెల్మెట్ రక్షణ కల్పిస్తుందని, ట్రాఫిక్ నిబంధనలు పాటించడం ద్వారా ప్రమాదాలను తగ్గించవచ్చన్నారు. పాడైన లేదా పగిలిన హెల్మెట్లను ఉపయోగించకూడదని సూచించారు.