ప్రతి ఒక్కరికి ఆర్టీఐపై అవగాహన పెంపొందించాలి
13-08-2026 12:37 PM
మల్లాపూర్, ఆగస్టు 13 (విజయక్రాంతి): సమాచార హక్కు చట్టం (ఆర్టీఐ)పై ప్రజల్లో మరింత అవగాహన పెంపొందించాల్సిన అవసరం ఉందని కౌన్సిలర్ ఫర్ సిటిజన్ రైట్స్ జగిత్యాల రిప్రెజెంటేటివ్ విజయ్ నేత అన్నారు. ఆర్టీఐ ద్వారా ప్రభుత్వ కార్యక్రమాలు, అభివృద్ధి పనులు, నిధుల వినియోగం తదితర వివరాలను తెలుసుకోవచ్చన్నారు. ప్రజలు తమ హక్కులను తెలుసుకుని ఆర్టీఐని సద్వినియోగం చేసుకోవడం ద్వారా పారదర్శకత, జవాబుదారీతనం పెంపొందించడంతో పాటు అవినీతిని అరికట్టవచ్చన్నారు. యువత ఆర్టీఐ వినియోగంలో చురుకుగా పాల్గొనాలని విజయ్ నేత సూచించారు.






