ఉచిత స్కూల్ యూనిఫాంల పంపిణీ
13-08-2026 12:35 PM
బెజ్జంకి, ఆగస్టు 13: సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలం గాగిల్లాపూర్ గ్రామ ప్రభుత్వ పాఠశాలలో గురువారం ఉచిత స్కూల్ యూనిఫాంల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. గ్రామ సర్పంచ్ ఎర్రల జానకి రాజు విద్యార్థులకు యూనిఫాంలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను విద్యార్థులు సద్వినియోగం చేసుకొని ఉన్నత చదువులు చదివి గ్రామానికి మంచి పేరు తీసుకురావాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ చింతలపల్లి పద్మ, వార్డు సభ్యులు, ఇందిరమ్మ కమిటీ సభ్యులు, వీఓ అధ్యక్షురాలు ముత్యం శోభ, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.






