13 August, 2026 | 1:41 PM

గజ్వేల్‌లో ఘనంగా వెంకటేశ్వర కల్యాణోత్సవం

13-08-2026 12:36 PM

గజ్వేల్‌, ఆగస్టు 13: శ్రావణమాస ప్రారంభాన్ని పురస్కరించుకుని గజ్వేల్‌ శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర ఆలయంలో 30 రోజుల పాటు నిర్వహించే స్వామివారి కల్యాణోత్సవాలు గురువారం ఘనంగా ప్రారంభమయ్యాయి. ఆలయ ప్రధాన అర్చకులు శేషం శ్రీనివాసాచార్యులు, ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఉదయ్‌ ఆచార్యుల వైదిక నిర్వహణలో స్వామివారికి, లక్ష్మీ,  గోదాదేవి అమ్మవార్లకు కల్యాణం నిర్వహించారు. శ్రావణమాసం మొత్తం జరిగే ఈ కల్యాణోత్సవాల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కావాలని ఆలయ కమిటీ అధ్యక్షులు లక్ష్మణ్‌, ప్రధాన అర్చకులు శేషం శ్రీనివాసాచార్యులు, ఉపాధ్యక్షులు తిరుపతిరెడ్డి, సహాయ కార్యదర్శి దేవులపల్లి రాజారామ్‌, సభ్యులు గంగ రమేష్‌ కోరారు.