7 May, 2026 | 5:23 PM

సౌర విద్యుత్ వల్ల కలిగే లాభాల గురించి రైతులకు అవగాహన

07-05-2026 04:45 PM

నాగిరెడ్డిపేట్,మే 7(విజయక్రాంతి): ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల ప్రణాళికలో భాగంగా నాగిరెడ్డిపేట్ మండలంలోని రైతు వేదికలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో రైతు వారోత్సవాలలో భాగంగా నాలుగవ రోజు వ్యవసాయ క్షేత్రాలు సౌర విద్యుత్తు కేంద్రాలు కార్యక్రమంలో వ్యవసాయ శాఖ,విద్యుత్ శాఖవారు పాల్గొనడం జరిగింది.ఈ కార్యక్రమంలో విద్యుత్ శాఖ ఏడిఏ సతీష్ రెడ్డి మాట్లాడుతూ... పీఎం కుసుం పథకం గురించి వివరిస్తూ రైతులు వ్యవసాయ మరియు బంజర భూముల్లో సౌర విద్యుత్ ఏర్పాటు చేసుకోవడానికి రైతులకు రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీని అందిస్తుందని తెలియజేశారు.

వ్యవసాయ క్షేత్రాల్లో సౌర విద్యుత్  కలిగే లాభాల గురించి వివరించడం జరిగింది.అదేవిధంగా వ్యవసాయ విస్తరణ అధికారి ప్రశాంత్ కుమార్ మాట్లాడుతూ యాంత్రికరణలో భాగంగా రైతులకు అవసరం ఉన్న యంత్ర పరికరాలను గత సంవత్సరం మాదిరిగా ఈ సంవత్సరం కూడా దరఖాస్తు చేసుకోవాలని రైతులకు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో ఏడిఏ సతీష్ రెడ్డి,ఏఈ నాగరాజు, వ్యవసాయ విస్తరణ అధికారి ప్రశాంత్ కుమార్,లైన్ ఇన్స్పెక్టర్ సురేందర్, ఆత్మ కమిటీ డైరెక్టర్లు లక్ష్మణ్ ఠాగూర్,దివిటీ కిష్టయ్య, వదలపర్తి సర్పంచ్ సత్యబోయిన పద్మ నారాయణ,రైతులు సాయిబాబు,సిద్దయ్య, అంజయ్య,గంగయ్య,రాజు, శ్రీకాంత్,చంద్రయ్య తదితరులు పాల్గొన్నారు.