29 June, 2026 | 1:34 AM

నీటి బొట్టును ఒడిసిపట్టాలి

29-06-2026 12:36 AM

క్యాచ్ ది రెయిన్ ప్రచారంలో భాగస్వామ్యం కావాలి

పసిడి కొనుగోళ్లకు దూరం ఉన్నందుకు ధన్యవాదాలు

ప్రజా వాహనాల్లో ప్రయాణించడంతో రవాణాకు ఊతం, కాలుష్యానికి చెక్

బీమాతో కోట్లాది మందికి ధీమా

నాందేడ్ వివాహ వేడుక సమాజానికి ఆదర్శప్రాయం

మన్ కీ బాత్‌లో ప్రధాని మోదీ పిలుపు

న్యూఢిల్లీ, జూన్ 28: ప్రతివర్షపు నీటి బొట్టును ఒడిసిపట్టాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. ఇందులో భాగంగా ప్రారంభించిన ‘క్యాచ్ ది రెయిన్’ అనే ప్రచారాన్ని విస్తృతంచేయాలని దేశప్రజలకు పిలుపునిచ్చారు. మానవాళికి అత్యంత అవసర మైన వనరులో ముఖ్యమైనది నీరేనని చెప్పారు. సమస్త జీవకోటికి ప్రాణధారం నీరన్నా రు. దాన్ని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతీఒక్కరిపై ఉందని చెప్పారు. ఆదివారం ‘మన్ కీ బాత్’ 135వ ఎపిసోడ్‌లో ప్రధాని మోదీ ప్రసంగించారు.

‘క్యాచ్ ది రెయిన్’ అనే ప్రచారాన్ని తక్కువ చేయొద్దన్నారు. జాతీయ భద్రత, స్వావలంబన రంగాల్లో 2026 తొలి అర్ధభాగం అనేక విజయాలతో కూడుకొని ఉందని, ఇది ప్రతీ భారతీయుడిని గర్వంతో నింపే క్షణమని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. కోల్ కతా పర్యటనలో ఐఎన్‌ఎస్ దునగిరి, సంశోధక్, అగ్రయ న్‌లను నౌకాదళంలోని ప్రవేశపెట్టే అవకాశం తనకు దక్కడంతో సంతోషం వ్యక్తం చేశారు. దేశ రక్షణ తయారీ సామర్థ్యాలను ఇవి నొక్కి చెబుతున్నాయన్నారు. అదే సమయంలో సీ 295 ‘మేడ్ ఇన్ ఇండియా’ ద్వారా రూపొందిన రవాణా విమానం ఒక పెద్దవిజయమ న్నారు.

భవిష్యత్‌లో దేశంలోనే ఈ రకమైన 40 విమానాలు తయారు కానున్నాయని చెప్పారు. పసిడి కొనుగోళ్లకు కొంతకాలం దూరంగా ఉండాలని తాను చేసిన విజ్ఞప్తిపై దేశ ప్రజలు సానుకూలంగా స్పందించినందుకు ధన్యవాదాలు తెలిపారు. ఒకే దిశలో ప్రయాణించే వారు సొంతవాహనాలను వదిలి ప్రజారవాణాలో ప్రయాణించడం శుభసూచకమన్నారు. దీంతో పెట్రోల్, డిజీ ల్ వంటి ఇంధనం ఆదా అవుతోందన్నారు.  రవాణా రంగానికీ ఊతమన్నారు. ట్రాఫిక్ తగ్గడంతోపాటు, కాలుష్యం కూడా తగ్గుతుందని చెప్పారు.

మహారాష్ట్రలో జరిగిన ఓ వివాహా వేడుకపై హర్షం వ్యక్తం చేశారు. ఈ వేడుక తీరు సమాజానికి ఆదర్శప్రాయమన్నారు. నాందేడ్‌లోని పేఠ్కర్ అనే కుటుం బంలో జరిగిన వివాహ వేడుక సందర్భంగా 3,500మంది గ్రామస్తులకు రూ.లక్ష ప్రమా ద బీమా అందిందన్నారు. దీనిపై ప్రధాని సంతోషం వ్యక్తం చేసి ఆ కుటుంబానికి అభినందనలు తెలిపారు. ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన యోజన కింద సంవత్సరానికి రూ.2 లక్షల బీమా కవరేజీని కోట్లా ది కుటుంబాలకు అందజేస్తున్నామన్నారు.

దేశవ్యాప్తంగా 11 లక్షల కుటుంబాలకు 22 కోట్ల సహాయాన్ని అందుకున్నాయని వివరించారు. ప్రధానమంత్రి సురక్షా బీమా యోజన కింద రూ.20 వార్షిక ప్రీమియం తో రూ.2లక్షల ప్రమాద బీమా పొందుతారని చెప్పారు. నాగాలాండ్‌లో ‘బేబీ లీగ్’ పోటీ 10 నుంచి 12 ఏళ్ల పిల్లల్లోని ప్రతిభను వెలికి తీస్తుందన్నారు. మేఘాలయ ప్రకృతికి, మానవులకు మధ్య అద్భుతమైన ఉదాహరణగా చెప్పారు. ఇక్కడి జీవ వేరు వంతెనల నిర్మాణాలను ప్రశంసించారు.

ఇక్కడి ప్రజ లు ప్రకృతితో మమేకమై ఎలాం టి అద్భుతాలను సృష్టించగలరో ఈ వంతెనలే ఉదాహర ణగా అభివర్ణించారు. నలంద విశ్వవిద్యాలయం క్రమబద్ధమైన విద్యనందించే విధా నాన్ని, ఢిల్లీ సెంట్రల్ యూనివర్సిటీలో ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్, డేటా సైన్స్ లాంటి నిర్ణయాలను స్వాగతించారు. చివరగా ప్రతీ నీటి బొట్టును సంరక్షించే ‘క్యాచ్ ది రెయిన్’ను యజ్ఞంలా చేపట్టాలని, ప్రతీ వర్షపు చుక్కను ఒడిసి పట్టాలని దేశప్రజలకు ప్రధాని విజ్ఞప్తి చేశారు.