20 August, 2026 | 8:22 PM

విద్యార్థులకు బాల్య దశనుండే ఆర్థిక క్రమశిక్షణ అవసరం

20-08-2026 07:48 PM

ఎస్బిఐ ఫీల్డ్ ఆఫీసర్లు షేక్ రియాజ్, వై. నాగరాజు

నేరేడుచర్ల,(విజయక్రాంతి): విద్యార్థులకు బాల్య దశనుండే ఆర్థిక క్రమశిక్షణ అవసరమని స్థానిక ఎస్బిఐ ఫీల్డ్ ఆఫీసర్లు షేక్ రియాజ్, వై నాగరాజు అన్నారు. సూర్యాపేట జిల్లా, పీఎం శ్రీ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నేరేడుచర్ల నందు విద్యార్థులకు ఆర్థిక అక్షరాస్యత స్వావలంబనపై నిర్వహించిన అవగాహన కార్యక్రమలో వారు మాట్లాడుతూ... విద్యార్థులు బాల్యదశ నుండే ఆర్థిక క్రమశిక్షణ అలవర్చుకోవాలని, ఇటీవల కాలంలో ఆన్లైన్లో జరుగుతున్నటువంటి మోసాల గురించి ఆర్థిక నేరాల గురించి వాటి నివారనోపాయాలను వివరిoచారు. ఈ కార్యక్రమoలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు బట్టు మధు, ఉపాధ్యాయులు ఎం.సైదులు వై జానయ్య కొనత వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు.