20 August, 2026 | 11:06 PM

ఉపాధ్యాయుల, ఉద్యోగుల, పెన్షనర్ల పెండింగ్ సమస్యలు వెంటనే పరిష్కరించాలి

20-08-2026 07:55 PM

నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపిన ఉపాధ్యాయులు

నేరేడుచర్ల,(విజయక్రాంతి): ఉపాధ్యాయుల పెండింగ్ సమస్యలను అన్నింటినీ వెంటనే పరిష్కరించాలని, నేరేడుచర్ల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో కాంప్లెక్స్ సమావేశాల సందర్భంగా ఉదయం టీ విరామ సమయంలో నల్ల బ్యాడ్జీలు ధరించి ఉపాధ్యాయులు నిరసన చేశారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ 2వ పిఆర్సిని వెంటనే అమలు చేయాలని,పెండింగ్ లో ఉన్న 06 డిఏలను  విడుదల చేయాలని, సిపిఎస్ రద్దు చేసి ఓపిఎస్ పునరుద్ధరించాలని, ప్రతి నెల రిటైర్మెంట్ అయ్యే వారికి ఇచ్చే బకాయిలను 2000 కోట్లు కాకుండా 3,000 కోట్ల వరకు చెల్లించాలి.

జివో 25ని సవరించాలని,తరగతి గదికి ఒక ఉపాధ్యాయుడిని ఇవ్వాలని, న్యూ ఈ హెచ్ ఎస్ ను సక్రమంగా అమలు చేయాలని,ఆగస్టు 27 న జిల్లా కేంద్రంలో జరిగే ధర్నాను ఎక్కువ సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని, సెప్టెంబర్ 1న పెన్షన్ విద్రోహదినం సందర్భంగా నిరసన తెలియజేయాలని, సెప్టెంబర్ 10న ఛలో హైద్రాబాద్ మహాధర్నా కు పెద్ద సంఖ్యలో హాజరు కావాలని పిలుపు నిచ్చారు. ఈ కార్యక్రమంలో కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు బట్టు మధు, ఆర్.శ్రీనయ్య, యన్. నరసింహారావు, వెంకటేశ్వరరావు, వెంకటేశ్వర్లు, వెంకటేశ్వరరావు, సైదులు, వెంకటరెడ్డి, సత్యనారాయణ రెడ్డి, వెంకన్న, అక్కయ్య బాబు,  ఉపాధ్యాయినీ, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.