19-04-2025 11:22:26 PM
కామారెడ్డి (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ ఆదేశాల మేరకు కల్తీకల్లు, గంజాయి, డ్రగ్స్ వంటి మత్తు పదార్థాలకు వ్యతిరేకంగా ప్రజల్లో అవగాహన కల్పించడానికి కామారెడ్డి జిల్లాలోని 22 మండలాల్లో 22 టీమ్స్ ఆధ్వర్యంలో మొత్తంగా 86 గ్రామాల్లో ఈ అవగాహన సదస్సులు నిర్వహించడం జరిగింది. ఈ సదస్సులను TGNAB హైదరాబాద్, Excise, police, health, పంచాయితీ రాజ్ డేపర్ట్మెంటుల ఆధ్వర్యంలో విజయవంతగా నిర్వహించి ప్రజలకు అవగాహన కలిపించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో వక్తలు మాట్లాడుతూ ప్రజలు ముఖ్యంగా యువకులు చెడు సవాసాలతో మత్తు పదార్థాలకు మొదట్లో సరదాగా తీసుకుంటూ క్రమంగా వాటికి బానిసలు అవుతూ వారి ఆరోగ్యాన్ని ,కుటుంబాలను అదే విధంగా సమాజాన్ని నాశనం చేసుకుంటున్నారని తెలిపారు.ఎక్కడో మహనగరాల్లో ఉండే ఈ మహమ్మారి కామారెడ్డి, ఎల్లారెడ్డి, banswada లాంటి చిన్న చిన్న పట్టణాలే కాకుండా గ్రామీణ ప్రాంతాలకూ విస్తరించాయని,వీటిని నిర్మూలించడానికి పోలీస్, excise, రెవిన్యూ డేపర్ట్మెంట్లు పూర్తి సంసిద్ధత తో ఉన్నాయని మత్తు పదార్థాలనీ రవాణా చేసే వ్యక్తులను Ndps చట్టం ప్రకారం శిక్షించడానికి సమాయత్తం అవుతున్నారు.
Ndps చట్ట ప్రకారం 20 సంవత్సరాలు వరకు శిక్ష పడే అవకాశం, అదే విధంగా ఆస్తులు జప్తు చేసే అవకాశం ఉందని అందుకే ఎవరూ వాటికి జోలికి పోవద్దని తెలియచేశారు.మత్తు పదార్థాల కు బానిసలు అయిన వ్యక్తులు వారి శరీరంలో ని అతి ముఖ్యమైన అవయవాలను చిన్న వయసులోనే పనికి రాకుండా చేసుకుని వారి కుటుంబానికి, సమాజానికి భారంగా మారుతున్నారని తెలియచేశారు. మత్తు పదార్థాల వల్లే కలిగే దుష్పరిణమనలను ప్రజలు ఆరోగ్య పరంగా సామాజిక పరంగా ఆర్థిక పరంగా మరియు నైతికంగా రోజు రోజు కి పతనం అవుతూ వివిధ రకాలైన నేరాలకు పాల్పడుతూ సమాజాన్ని మరియు శాంతి భద్రతల కు విఘాతం కలిగిస్తున్నారు.ఇటువంటి వారిని ఇకముందు ఉపేక్షించేది లేదని తెలియచేశారు.
మత్తు పదార్థాల సరఫరా, విక్రయం మరియు సేవించే వారి యొక్క సమాచారాన్ని 1908 Ts nab కి తెలియచేసినట్టు అయితే వారి సమాచారాన్ని గోప్యంగా ఉంచడమే కాకుండా అట్టి వారికి పారితోషికాలు కూడా ఇవ్వబడుతాయని తెలిపారు .అన్ని గ్రామాల్లో ఈ అవగాహన సదస్సులు నిర్వహించి ప్రతి ఒక్కరితో మత్తు పదార్థాలు సేవించబోమని ,రవాణా చేసేవారికి సహకరించబోమని , రవాణా చేసే వారి సమాచారం పోలీసులకు తెలియ చేస్తామని ప్రతిజ్ఞ చేశారు. ఈ సదస్సులలో ts nab నుండి వచ్చిన ప్రత్యేక అధికారులు , జిల్లా లోని అన్ని పోలీస్, excise స్టేషన్ ల ci లు, si లు, సిబ్బంది , వైద్య ఆరోగ్య సిబ్బంది ,రెవెన్యూ, పంచాయితీ రాజ్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో జరిగిన ఈ సదస్సులో అడిషనల్ కలెక్టర్ చందర్ నాయక్, కృష్ణమూర్తి, సోమనాథం, పవన్ కుమార్, హనుమంతరావు, చంద్రశేఖర్, మురళి, గ్రామ కార్యదర్శులు పాల్గొన్నారు.