calender_icon.png 4 May, 2025 | 6:06 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నక్సల్స్‌తో మాటల్లేవ్.. మాట్లాడుకోవడాల్లేవ్

04-05-2025 01:16:59 PM

మావోయిస్టులతో చర్చల ప్రసక్తే లేదు.. బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు

హైదరాబాద్: కరీంనగర్ జిల్లా(Karimnagar District)లోని కొత్తపల్లిలో కేంద్రమంత్రి బండి సంజయ్ కుమార్(Union Minister Bandi Sanjay) సంచలన వ్యాఖ్యలు చేశారు. మావోయిస్టులతో(Maoists) చర్చల ప్రసక్తే లేదని బండి సంజయ్ తేల్చిచెప్పారు. నక్సల్స్ తో మాటల్లేవ్.. మాట్లాడుకోవడాల్లేవ్ అని కేంద్రమంత్రి చెప్పారు. తుపాకీ వదిలిపెట్టేవరకు నక్సల్స్(Naxals)తో చర్చల ఊసే ఉండదదని ఆయన స్పష్టం చేశారు. తుపాకీతో అమాయకులను చంపేవారితో చర్చలు ఉండవదని సూచించారు. మావోయిస్టులపై నిషేధం విధించింది కాంగ్రెస్సేనని కేంద్రమంత్రి బండి సంజయ్(Bandi Sanjay Kumar) గుర్తుచేశారు. నక్సల్స్.. పలు పార్టీల నేతలను మందుపాతరలు పెట్టి చంపారని గుర్తుచేశారు. ఇన్ ఫార్మర్ల నెపంతో గిరిజనులను అన్యాయంగా చంపారని ఆరోపించారు. ఎన్నో గిరిజనుల కుటుంబాలకు మానసిక క్లోభ మిగిల్చారని విమర్శించారు. పాస్ పోర్ట్ లేని విదేశీయులను గుర్తించి పంపిస్తున్నామన్న కేంద్రమంత్రి బండి రోహింగ్యాలపై తన వైఖరి ఏమిటో కాంగ్రెస్ పార్టీ(Congress party) చెప్పాలని డిమాండ్ చేశారు.