calender_icon.png 4 May, 2025 | 9:35 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కుంటాల జలపాతం వద్ద రూప్ వే నిర్మాణం..

19-04-2025 11:23:46 PM

జలపాతాన్ని సందర్శించిన మంత్రి సీతక్క...

నేరడిగొండ (విజయక్రాంతి): కుంటాల జలపాతాన్ని సందర్శించేందుకు వచ్చే పర్యాటకుల సౌకర్యార్ధం రూప్ వే నిర్మాణానికి చర్యలు చేపడతామని రాష్ట్ర మంత్రి సీతక్క వెల్లడించారు. జిల్లా పర్యటనలో భాగంగా శనివారం టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి, స్థానిక కాంగ్రెస్ పార్టీ నేతలతో కలిసి కుంటాల జలపాతాన్ని సందర్శించారు. రాష్ట్రంలోనే అతిపెద్ద జలపాతంగా పేరుగాంచిన కుంటాల జలపాతం అభివృద్ధికి ప్రభుత్వం చర్యలు చేపడుతొందన్నారు.