calender_icon.png 4 May, 2025 | 4:14 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఖనిజ సంపదను కార్పొరేట్ శక్తులకు అప్పగించే లక్ష్యంతోనే ఆపరేషన్ కగార్

04-05-2025 12:50:23 PM

సిపిఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ. 

నాగర్ కర్నూల్ (విజయక్రాంతి): దేశంలోని అటవీ ప్రాంతంలో ఉన్న ఖనిజ సంపద, అటవీ సంపదను కార్పొరేట్ శక్తులకు అప్పగించే లక్ష్యంతోనే ఆపరేషన్ కగార్ పేరుతో మావోయిస్టులను అంతం చేయాలని బిజెపి ప్రభుత్వం నిర్ణయించిందని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ(CPM State Secretary John Wesley) ఆరోపించారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని ఆ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. మావోయిస్టులు శాంతి చర్చలకు సిద్ధంగా ఉన్నామని పదేపదే బహిరంగంగా చెప్పినప్పటికీ బిజెపి ప్రభుత్వం వారిని పూర్తిస్థాయిలో అంతం చేయాలనే లక్ష్యంతోనే ముందడుగు వేస్తోందని కర్రిగుట్ట ప్రాంతంలో తలదాచుకున్న  మావోయిస్టులను అంతం చేయాలని మొండిగా ఉందన్నారు. దేశంలోని ఖనిజ సంపదను కార్పొరేట్ శక్తులకు అప్పగించాలని అందుకు వ్యతిరేకిస్తున్న మావోయిస్టులను తుదముట్టించేందుకు ప్రయత్నిస్తుందన్నారు.

ఇప్పటికే 400 మందికి పైగా మావోయిస్టుల పేరుతో ఆదివాసీలను పొట్టన పెట్టుకుందని అందులోని కొంతమంది మహిళలను కూడా అత్యాచారాలకు పాల్పడుతూ చిత్రహింసలకు గురి చేస్తున్నారని మండిపడ్డారు. తప్పు చేసిన వారిని చట్టపరంగా శిక్షించాల్సిన అవసరం ఉన్నప్పటికీ వారిని అంతం చేయాలనే లక్ష్యం ఏర్పాటు చేసుకోవడం ఉద్దేశం ఏంటో చెప్పాలన్నారు. కేంద్ర ప్రభుత్వం కుల, జన గణన చేపడతామని చెప్తున్నప్పటికీ నిర్దిష్టమైన సమయం చెప్పకపోవడం ఆంతర్యమేంటో చెప్పాలన్నారు. చిత్తశుద్ధి ఉంటే ఎప్పటిలోగా కులగన పూర్తి చేస్తారో చెప్పాలని డిమాండ్ చేశారు.

ముస్లిం మైనార్టీలను బీసీలో కలపాద్దని కులగననే చేయొద్దని చెప్పడం దుర్మార్గమన్నారు. వక్ఫ్ బోర్డు ఆస్తులను పారిశ్రామికవేత్తలకు అప్పగించాలనే కుట్రలో భాగంగానే వక్ఫ్ బోర్డు చట్టం చేస్తోందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన ఆర్గారంటీల్లో బస్సు ప్రయాణం మినహా ఏ ఒక్కటి అమలు చేయలేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పెట్టుబడుల కోసం అందాల పోటీలను నిర్వహించడం సిగ్గుచేటన్నారు. అందాల పోటీలు నిర్వహించడం వల్ల పాశ్చాత్య సంస్కృతి రాజ్యమేలుతుందన్నారు. వారితోపాటు జిల్లా కార్యదర్శి వర్ధం పర్వతాలు, కార్యదర్శి వర్గ సభ్యురాలు గీత, దేశ్య నాయక్, బి.ఆంజనేయులు, ఆర్ శ్రీను, సిపిఎం నాయకులు మధు, అశోక్, శ్రీనివాసులు, శివరాం, నరసింహ, కాశన్న తదితరులు ఉన్నారు.