04-05-2025 12:23:33 PM
చండీగఢ్: పంజాబ్ పోలీసులు(Punjab Police) జరిపిన నిఘా ఆపరేషన్‌లో, అమృత్‌సర్‌లోని ఆర్మీ కంటోన్మెంట్ ప్రాంతాలు, వైమానిక స్థావరాల సున్నితమైన సమాచారం, ఛాయాచిత్రాలను లీక్ చేయడంలో వారి పాత్రకు సంబంధించి ఇద్దరు వ్యక్తులను అరెస్టు(Pakistani spies arrested) చేశారు. అమృత్‌సర్ గ్రామీణ పోలీసులు శనివారం పాలక్ షేర్ మాసిహ్, సూరజ్ మాసిహ్‌లను అరెస్టు చేసినట్లు పోలీస్ డైరెక్టర్ జనరల్ గౌరవ్ యాదవ్ ఆదివారం తెలిపారు. ప్రస్తుతం అమృత్‌సర్ సెంట్రల్ జైలులో ఉన్న హర్‌ప్రీత్ సింగ్ అలియాస్ పిట్టు ద్వారా వారికి పాకిస్తాన్ నిఘా కార్యకర్తలతో సంబంధాలు ఉన్నాయని ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైందని డిజిపి తెలిపారు. అధికారిక రహస్యాల చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగుతోందని తెలిపారు. దర్యాప్తు ముమ్మరం చేస్తున్న కొద్దీ మరిన్ని కీలక విషయాలు వెల్లడవుతాయని ఆశిస్తున్నామని డీజీపీ స్పష్టం చేశారు.