04-05-2025 01:21:10 PM
ఆలయ అభివృద్ధి పనుల పరిశీలన...
గడువులోగా అభివృద్ధి పనులను పూర్తి చేయాలని అధికారులకు ఆదేశం..
వైరా, విజయక్రాంతి: వైరా మండల పరిధిలోని స్నానాల లక్ష్మిపురం గ్రామంలో శ్రీ రామలింగేశ్వర స్వామి తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క(Deputy Chief Minister Bhatti Vikramarka) ఆదివారం పర్యటించారు. ఆయనకు స్ధానిక శాసన సభ్యులు మాళోత్ రాందాస్ నాయక్ గ్రామంలో ఘనంగా స్వాగతం పలికారు. శ్రీరామలింగేశ్వర స్వామి ఆలయం(Sri Ramalingeswara Swamy Temple)లో జరుగుతున్న స్నానాల ఘాట్,స్నానాల గదులు,ప్రహరీ గోడ వంటి పలు అభివృద్ధి పనులను పరిశీలించారు. వైరా నది వాగు పై నిర్మాణం చేయనున్న రిటైనింగ్ వాల్ చెక్ డ్యాం, ఫ్లై ఓవర్ బ్రిడ్జి పనులను పరిశీలించి నిర్దేశించుకున్న గడువులోగా అభివృద్ధి పనులను పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులకు ఆదేశించారు. వారి వెంట గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు, పిసిసి జనరల్ సెక్రెటరీ నూతి సత్యనారాయణ గౌడ్ తదితరులు ఉన్నారు.