26-06-2025 12:14:15 AM
గద్వాల, జూన్ 25 ( విజయక్రాంతి ) : గద్వాల మండలం శెట్టి ఆత్మకూరు శివారు పరిధిలో గల అభ్యుదయ రైతు వెంకట్రామి రెడ్డి ఆయిల్ పామ్ తోటలో పామ్ ఆయిల్ సాగు పై అవగాహన మరియు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు.
ఈ శిక్షణ కార్యక్రమంలో భాగంగా జిల్లా ఉద్యాన అధికారి అక్బర్ రైతులకు ఆయిల్ పామ్ సాగు పై శాస్త్రీయ అవగాహన కల్పిస్తూ రైతులకు గల సందేహాలకు, సమస్యలకు సలహాలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో అభ్యుదయ రైతు వెంకట్రామి రెడ్డి గ, స్థానిక ఉద్యాన అధికారి ఎం.రాజశేఖర్, అయిజ మండల ఉద్యాన అధికారులు, టి.జి. ఆయిల్ ఫెడ్ గద్వాల ఫీల్ ఆఫీసర్ శశిధర్ గౌడ్ మరియు 50 మంది ఇతర రైతులు పాల్గొనడం జరిగింది.
సెలెక్టెడ్ కమిటీ మెంబర్‌గా చక్రవర్తి ఆచార్యులు
అయిజ, జూన్ 25 : జోగులాంబ గద్వాల జిల్లా ధూప దీప నైవేద్య అర్చక సమాఖ్య లో గ్రామాలలో ఉన్నటువంటి అర్చకులను దేవాలయాలను పునః పరిశీలించి సెలెక్టెడ్ కమిటీ లో భాగంగా అయిజ కు చెందిన గద్వాల జిల్లా చక్రవర్తి చార్యులను బుధవారం ఎంపికయ్యారు. ఈ సందర్భంగా అర్చక సమాఖ్య ఐజ పట్టణ తదితర సభ్యులు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.