17 April, 2026 | 2:53 AM

సిరిసిల్ల కలెక్టరేట్ చౌరస్తాలో సీట్ బెల్ట్‌పై అవగాహన : జిల్లా రవాణా అధికారి లక్ష్మణ్

17-04-2026 12:58 AM

కరీంనగర్: ఏప్రిల్ 16(విజయక్రాంతి):అర్రైవ్ అలైవ్ ప్రోగ్రాం లో భాగంగా కలెక్టర్ ఆదేశాల మేరకు సిరిసిల్ల పట్టణంలోని కలెక్టరేట్ చౌరస్తాలో సీట్ బెల్ట్ పై జిల్లా రవాణా శాఖ సిబ్బంది అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు ఇట్టి కార్యక్రమం లో జిల్లా పోలీస్ ట్రాఫిక్ అధికారులు ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ పాల్గొన్నారు. మోటారు వాహన తనిఖీ అధికారి మరియు పోలీస్ సిబ్బంది మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా సీట్ బెల్ట్ వేసుకొని వాహనాన్ని నడపాలని, లేనిచో ప్రమాదాలు జరిగినప్పుడు సీట్ బెల్ట్ పెట్టుకోకపోవడం వలన ఎయిర్ బ్యాగ్స్ ఓపెన్ కావని, తద్వారా ప్రాణనష్టం జరిగే అవకాశం ఉందని తెలిపారు

అదేవిధంగా డ్రైవర్ తో పాటు ఇతర సీటులో కూర్చున్న ప్రయాణికులు కూడా తూచా తప్పకుండా సీట్ బెల్ట్ ను ధరించాలని ఎట్టి పరిస్తుతుల్లో మద్యం తాగి వాహనమ్ నడపవద్దని తెలియజేశారు.అదేవిధంగా సిరిసిల్ల పట్టణ పోలీస్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ గారు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రతా నియమాలను పాటించాలని ఉత్తమ పౌరులుగా ఉండాలని తెలియజేశారు. వాహనదారులు అందరితో రహదారి భద్రత ప్రతిజ్ఞను రవాణా శాఖ ఇన్స్పెక్టర్ చేయించారు. సీటు బెల్టు ధరించిన వాహనదారులకు ఔత్సాహికంగా వినూత్న పద్ధతిలో మిఠాయి లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సిరిసిల్ల సహాయక మోటారు వాహనాల తనిఖీ అధికారి పృద్విరాజ్ వర్మా పోలీస్ మరియు ట్రాఫిక్ పోలీసు ,సిబ్బంది,వాహన దారులు సుమారు 300 మంది వాహనదారులు పాల్గొనడం జరిగింది.