5 June, 2026 | 3:23 PM

Breaking News

వైసీపీ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు అరెస్ట్   •   శ్రీ కన్యకా పరమేశ్వరి ఆలయంలో టీటీడీ వారిచే కుంకుమ పూజలు   •   అక్రమ కేసులకు వ్యతిరేకంగా బిజినేపల్లి ఠాణా ముట్టడి   •   ప్రపంచ పర్యావరణ దినోత్సవ సందర్భంగా పంచాయతీలో అవగాహన సదస్సు   •   కేఓసీలో ఘనంగా ప్రపంచ పర్యావరణ దినోత్సవం   •   నూతన మున్సిపల్ కమిషనర్‌ను కలిసిన చైర్మన్, వైస్ చైర్మన్, కౌన్సిలర్ల   •   అమీర్‌పేట అగ్నిప్రమాదం: బాధితులను పరామర్శించిన కవిత   •   కదులుతున్న రైలుపై రాళ్ల దాడి.. లోకో పైలట్‌కు తీవ్రగాయాలు   •   ఉపాధి హామీ కూలీలకు రూ.800 కూలి ఇవ్వాలి   •   పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత   •  

ప్రపంచ పర్యావరణ దినోత్సవ సందర్భంగా పంచాయతీలో అవగాహన సదస్సు

05-06-2026 02:48 PM

పాల్గొన్న టు ఇంక్లైన్  పంచాయతీ ప్రజలు...

ఈనెల 10న గ్రామసభ ఏర్పాటు...

కొత్తగూడెం,(విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని సుజాతనగర్ మండలంలో గల టూ ఇంక్లైన్ పంచాయతీలో శుక్రవారం రోజున ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని, అట్టహాసంగా ప్రారంభించారు,సెక్రటరీ రోహిణి సర్పంచ్ అరుణ, ఉపసర్పంచ్ సింగరాల రమేష్, వార్డు మెంబర్ నగేష్ (మాజీ సర్పంచ్) ఇంకా పలువురు వార్డు మెంబర్లు పంచాయతీ ప్రజలు పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. పంచాయతీ సర్పంచ్ జి అరుణ మాట్లాడుతూ, పర్యావరణం పరిరక్షణ పచ్చదనం, ప్రగతివనం, ప్రతి ఇంటిలో,రోడ్డుకి ఇరువైపులా మొక్కలు నాటి పర్యావరణాన్ని రక్షించాలని సూచించారు. టూ ఇంక్లైన్ ప్రజానీకానికి  వేసవికాలంలో, నీటి కొరత లేకుండా, ప్రజల దాహార్తిని తీర్చడం జరిగిందని, డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణం చేపట్టామని, నిత్యం పంచాయతీ పరిశుభ్రతపై దృష్టి సారించామని, భవిష్యత్తులో ప్రజల దాహార్తిని తీర్చడానికి,

బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టమని, ఇందులో భాగంగా  భారీ భాండాగారాన్ని ఏర్పాటుకు,సుమారు 66లక్షలతో  నిర్మాణం చేపట్టారని, వీధి దీపాలు సైతం రానున్న వర్షాకాలం ని దృష్టిలో ఉంచుకొని రాత్రి వేళలో వెలుగులు విరజిమ్మెల చర్యలు తీసుకుంటున్నామని ఈ సందర్భంగా తెలియజేశారు. అనంతరం పంచాయతీ నూతన సెక్రటరీ రోహిణి మాట్లాడుతూ, పంచాయతీలో పలు సమస్యలపై ప్రజలు ఎప్పుడైనా తెలియజేయవచ్చని, పంచాయతీ కార్యాలయంలో సంప్రదించి తమ సమస్యలను నివృత్తి పరచుకోవచ్చని, ఎల్లవేళలా ప్రజలకు అందుబాటులో పంచాయతీ అధికారి ఉంటారని, ఎటువంటి సమస్యలు ఉన్న నిరాటంకంగా ఈనెల 10వ తేదీన గ్రామసభలో చర్చించవచ్చని ఈ సందర్భంగా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ రమేష్ తో పాటు, వార్డ్ నెంబర్ ( మాజీ సర్పంచ్)నగేష్, పలువురు వార్డు సభ్యులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.