బాలల హక్కులు, చట్టాలపై అవగాహన
అలంపూర్, ఏప్రిల్ 8: భారత రాజ్యాంగంలో బాలలకు ప్రత్యేకమైన చట్టాలు హక్కులు పొందుపరిచారని బాలల హక్కుల ప్రాముఖ్యత వారికున్న చట్టాలపై అవగాహన కల్పించడం తో పాటు బాలల చట్టాలను అతిక్రమిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని కాబట్టి ప్రతి ఒక్కరు బాలల హక్కులు, చట్టాలను కాపాడాలని ఎంపీడీవో పద్మావతి అన్నారు.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా బుధ వారం అలంపూర్ మండలం లింగనవాయి గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో బాలల హక్కులు వారికున్న చట్టాలపైన విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. అనంతరం విద్యార్థులను ఉద్దేశించి ఎంఈఓ అశోక్ కుమార్ మాట్లాడుతూ .. బడి మానేసిన పిల్లలు ఎవరైనా ఉన్నట్లయితే వారినిగుర్తించి తిరిగి బడిలో చేర్పించాలని తెలిపారు.
18 సంవత్సరాల లోపు పిల్లలను ఎవరైనా పనిలో పెట్టుకున్నట్లయితే చైల్ లేబర్ యాక్ట్ ప్రకారం ... చట్టపరమైన చర్యలు తప్పవని ఉంటాయని అన్నారు.ఎస్‌ఐ రామకృష్ణ మాట్లాడుతూ... బాలలపై లైంగిక వేధింపుల చట్ట ప్రకారం అమ్మాయిలపై ఎవరైనా లైంగిక దాడికి పాల్పడితే చట్ట ప్రకారం కనీసం ఏడు సంవత్సరాల వరకు జైలు శిక్ష ఉంటుందని తెలిపారు. కౌమార దశలో శారీరక మానసిక వికాసంలో వచ్చే మార్పుల గురించి అవగాహన కల్పించారు. గుడ్ టచ్ బ్యాడ్ టచ్ గురించి విద్యార్థులు అందరూ కూడా అవగాహన కలిగి ఉండాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో బాలల సంరక్షణ అధికారి జోగు రవి, చైల్ హెల్ప్ లైన్ టీం మెంబెర్ నవీన్ ,స్కూల్ హెచ్‌ఎం అనురాధ తదితరులు పాల్గొన్నారు.




