9 April, 2026 | 4:19 AM

చీపునుంతల గ్రామంలో తీరిన ఏళ్ల నాటి విద్యుత్ కష్టాలు

09-04-2026 01:37 AM

ఎమ్మెల్యే కసిరెడ్డి చొరవతో కొత్త ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు

తలకొండపల్లి, ఏప్రిల్ 8(విజయక్రాంతి) రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండలం చీపునుంతల గ్రామ ప్రజల దశాబ్దాల కల నెరవేరింది. గత కొంతకాలంగా గ్రామంలో నెలకొన్న తీవ్ర విద్యుత్ సమస్యకు శాశ్వత పరిష్కారం లభించింది.గ్రామంలో విద్యుత్ సరఫరా సరిగ్గా లేక ప్రజలు పడుతున్న ఇబ్బందులను స్థానిక నాయకులు ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి  దృష్టికి తీసుకెళ్లారు.

దీనిపై వెంటనే స్పందించిన ఎమ్మెల్యే, విద్యుత్ శాఖ AE మరియు Aౄలతో మాట్లాడి గ్రామానికి 100 కేవీ (100 KV) ట్రాన్స్ఫార్మర్ను మంజూరు చేయించారు.మంజూరైన కొత్త ట్రాన్స్ఫార్మర్ను బుధవారం గ్రామంలో అమర్చి, విద్యుత్ దీపాలను వెలిగించారు. దీంతో ఇకపై గ్రామానికి 24 గంటల నిరంతర విద్యుత్ అందుతుందని అధికారులు తెలిపారు.

తమ సమస్యను పరిష్కరించిన ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి కి గ్రామ సర్పంచ్ గుజ్జుల లక్ష్మమ్మ మరియు గ్రామస్తులు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.  కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ గుజ్జుల లక్ష్మమ్మ, అధ్యక్షుడు మలే రామచంద్రారెడ్డి, మాజీ మండల అధ్యక్షుడు గుజ్జుల మహేష్, లైన్మెన్ వెంకటయ్య, వశ్య, నాయకులు వెంకరాజు రెడ్డి, మాజీ సర్పంచ్ బండి రఘుపతి వార్డు సభ్యులు శారదా అంజమ్మ, రాజు, మల్లేష్, శేఖర్, గ్రామస్తులు  చెన్నకేశవులు, రాములు, మల్లయ్య, సాయినాథ్, పెంటయ్య, జంగయ్య, శ్రీశైలం, చెన్నయ్య, బోళ్ల శివ, కృష్ణ తదితరులు పాల్గొన్నారు.