calender_icon.png 18 September, 2025 | 8:52 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సైబర్ మోసాలపై అవగాహన

27-10-2024 12:28:28 AM

హైదరాబాద్ సిటీబ్యూరో, అక్టోబర్ 26 (విజయక్రాంతి): హైదరాబాద్ సిటీ సెక్యూరిటీ కౌన్సిల్(హెచ్‌సీఎస్‌సీ), హైదరాబాద్ సిటీ పోలీసులు సంయుక్తంగా నగర ప్రజలను సైబర్  సెక్యూరిటీ మోసాల బారిన పడకుండా అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. ఈ మేరకు శనివారం సాయం త్రం బంజారాహిల్స్‌లోని జీవీకే మాల్‌లో హైదరాబాద్ అవేర్‌నెస్ సైబర్ సెక్యూరిటీ నాలెడ్జ్ సమ్మిట్ లో భాగంగా వీధి నాటకం ప్రదర్శించి సైబర్ సెక్యూరిటీ జాగ్రత్తలపై అవగాహన కల్పించారు. అలాగే ప్రజలకు సైబర్ క్రైమ్ విభాగానికి సంబంధించిన హెల్ప్‌లైన్ నంబర్, వెబ్‌సైట్ వివరాలను అందించారు. నవంబర్ 2న ప్రసాద్ ఐమాక్స్‌లో సైబర్ మోసాల అవగాహనపై వీధి నాటకం ప్రదర్శిస్తామని నిర్వాహకులు తెలిపారు.