14 August, 2026 | 5:21 AM

సైబర్ నేరాలపై అవగాహన

14-08-2026 12:22 AM

నందిగామ, ఆగస్టు 13 (విజయక్రాంతి): నందిగామ పోలీస్ స్టేషన్ పరిధిలోని *మేకగూడ గ్రామంలో నాట్కో  ఫార్మా కంపెనీ ఉద్యోగులకు సైబర్ నేరాలపై అవగాహన  కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం, ఫిషింగ్ లింకులు, మోసపూరిత కాల్స్, OTPలు, బ్యాంకింగ్ వివరాలు మరియు వ్యక్తిగత సమాచారాన్ని ఇతరులతో పంచుకోకూడదని అవగాహన కల్పించారు.

సైబర్ మోసానికి గురైన వెంటనే 1930 సైబర్ క్రైమ్ హెల్ప్లైన్కు సమాచారం అందించాలని సూచించారు.  నందిగామ సి ఐ వీరబాబు  మాట్లాడుతూ, సైబర్ నేరాల పట్ల ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని, అనుమానాస్పద లిం కులు, కాల్స్ మరియు సందేశాలకు స్పందించకుండా జాగ్రత్తలు పాటించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో నందిగామ పోలీసులు, NATCO ఫార్మా కంపెనీ ఉద్యోగులు పాల్గొన్నారు.