calender_icon.png 5 December, 2025 | 1:54 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విద్యార్థులకు సైబర్ నేరాలపై అవగాహన

05-12-2025 01:48:52 AM

ఘట్ కేసర్, డిసెంబర్ 4 (విజయక్రాంతి) : తెలంగాణ రాష్ట్ర డీజీపీ ఉత్తర్వుల మేరకు గురువారం ఘట్ కేసర్ పోలీసులు కొండాపూర్ లోని సంస్కృతి ఇంజనీరింగ్ కళాశాలలో  300 మంది విద్యార్థులకు సైబర్ నేరాల అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆరు వారాల కార్యక్రమంలో మొదటి వారంలో ‘సైబర్ సారధి’ అనే థీమ్తో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయబడింది.

ఈకార్యక్రమంలో విద్యార్థులకు ఆన్లైన్ మోసాలు, సైబర్ భద్రత, మోసాలు జరిగిన వెంటనే తీసుకోవలసిన చర్యలపై అవగాహన కల్పించబడింది. చివరగా పోలీసులు, సైబర్ క్రైమ్ పోలీసుల ఆధ్వర్యంలో విద్యార్థినులను ఆన్లైన్లో జాగ్రత్తగా ఉండాలని, అనుమానాస్పదమైన సైబర్ కార్యకలాపాలను వెంటనే రిపోర్ట్ చేయాలని, తమ కుటుంబ సభ్యులు, స్నేహితులకు కూడా ఇదే అవగాహన కల్పించాలని సూచించారు.

ఇట్టి కార్యక్రమంలో ఘట్ కేసర్ ఇన్ స్పెక్టర్ ఎం. బాలస్వామి, సబ్ ఇన్ స్పెక్టర్ బి. ప్రభాకర్ రెడ్డి, కళాశాల డైరెక్టర్ డాక్టర్ ఎం. రమాకాంత్ రెడ్డి, ప్రిన్సిపల్ జానకి రాములు, శివకేశవ్ రెడ్డి, ఫ్యాకల్టీ, పోలీస్ సిబ్బంది, సైబర్ క్రైమ్ ప్రసన్న, తదితరులు పాల్గొన్నారు.