4 March, 2026 | 6:25 PM

అనుమతి లేకుండా ర్యాలీలు, సమావేశాలు, బహిరంగసభలు నిర్వహించొద్దు

05-12-2025 01:49 AM

పట్టణ సీఐ శివశంకర్

కోదాడ, డిసెంబర్ 4: శాంతి భద్రతల పరిరక్షణ దృష్ట్యా సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా  ఈనెల 31  వరకు ‘30 పోలీస్ ఆక్ట్‘ అమల్లో ఉంటుందని జిల్లా ఎస్పీ కె.నరసింహ ఆదేశానుసారం  పోలీసు అధికారుల అనుమతులు లేకుండా కోదాడ పట్టణంలో ఎలాంటి ర్యాలీలు, సమావేశాలు, ఊరేగింపులు, ధర్నాలు, బహిరంగ సభలు, ప్రజలు గుమిగూడి ఉండే విధంగా కార్యక్రమాలు నిర్వహించ రాదని కోదాడ పట్టణ ఇన్స్పెక్టర్ కే శివశంకర్ గురువారం తెలిపారు.

ఎలాంటి ముందస్తు అనుమతులు లేకుండ కార్యక్రమాలు నిర్వహిస్తే నిర్వాహకులపై  చట్టపరమైన చర్యలు తప్పవు. ప్రజా జీవనానికి ఇబ్బంది కలిగించే విధముగా సమావేశాలు, జన సమూహం చేయడం పూర్తిగా నిషేధము. సోషల్ మీడియా నందు అనవసరమైన విషయాలను, అసత్యాలను వ్యాప్తి చేసిన వారిపై కేసులను నమోదు చేయబడతాయని తెలిపారు. చట్టపరంగా జారీ చేసిన ఆదేశాలను ఎవరైనా ఉల్లంఘించినట్లయితే 30 పోలీస్ ఆక్ట్ ప్రకారం చర్యలు తప్పవు  మరియు బాణాసంచా ౄJ లు ఉపయోగించినచో వారి కఠిన చర్యలు ఉంటాయని తెలిపినారు.