సైబర్ నేరాలపై అవగాహన
నాగిరెడ్డిపేట్,మే 25 (విజయక్రాంతి): నాగిరెడ్డిపేట్ బస్టాండ్ ఆవరణలో వేసవి కాలంలో తీసుకోవలసిన జాగ్రత్తలు దొంగతనాలు జరగకుండా జాగ్రత్తలు సైబర్ నేరాలపై అవగాహన, హెల్మెట్ ఉపయోగంపై డ్రగ్స్ అండ్ డ్రైవ్ చేయవద్దని కార్యక్రమాన్ని కామారెడ్డి జిల్లా సూపర్డెంట్ ఆఫ్ పోలీస్ ఎం.రాజేష్ చంద్ర ఆదేశంసారం నాగిరెడ్డిపేట్ మండల సబ్ ఇన్స్పెక్టర్ ఏ.భార్గవ్ గౌడ్ సూచనల మేరకు పోలీస్ కళాబృందంచే అవగాహన కార్యక్రమాన్ని సోమవారం నాగిరెడ్డిపేట మండలంలోని బస్టాండ్ ప్రాంగణంలో నిర్వహించడం జరిగింది.
సైబర్ నేరాల నిమిత్తం కోసం టోల్ ఫ్రీ నెంబర్ 1930 సంప్రదించవచ్చన్నారు. అత్యవసర సమయంలో డయల్ 100 కాల్ చేయాలని తెలిపారు. అంతేకాకుండా రోడ్డు ప్రమాదాలు నివారణ కోసం తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, వేసవికాలంలో దొంగతనాలపై తగుజాగ్రత్తలు తీసుకోవాలని, చిన్న పిల్లలు సెలవుల సందర్భంగా ఈతలకు పోయి ప్రమాదాల బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎస్త్స్ర భార్గవ్ గౌడ్, పోలీస్ కళాబృందం ఇన్చార్జి హెడ్ కానిస్టేబుల్ రామంచ తిరుపతి శేషారావు, పోలీస్ కానిస్టేబుల్స్ ప్రభాకర్, సాయిలు, శ్రీశైలం, సుప్రజా శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.






