1 June, 2026 | 3:53 PM

Breaking News

జొన్నల తూకం కాంటా కోసం కొట్లాడుతున్న రైతులు   •   అందరికీ ఉద్యోగం ఇవ్వడం ఎప్పటికీ సాధ్యం కాదు: TGPSC చైర్మన్   •   వరి ధాన్యం సాగులో దేశంలో తెలంగాణ మొదటి స్థానం   •   తెలంగాణ ఆవిర్భావ వేడుకలను ఘనంగా నిర్వహించాలి: ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్   •   తెలంగాణ అమరవీరులు, ఉద్యమకారుల హామీలపై సీఎం స్పష్టత ఇవ్వాలి   •   గిరిజాయి గ్రామంలో అగ్ని ప్రమాదం రెండు లక్షల నగదు ఆరు లక్షల ఆస్తి నష్టం.   •   బీఎంఎస్ఆర్యు రాష్ట్ర అధ్యక్షుడిగా పప్పుల సురేష్   •   డీజేలకు అనుమతి లేదు: ఎస్సై ప్రవీణ్ కుమార్   •   రైతులకు ఉచితంగా విత్తనాలు, ఎరువులు అందించాలి   •   NEET-UG రీ-ఎగ్జామ్‌పై సుప్రీంకోర్టు కీలక ఉత్తర్వులు   •  

ఔషధ నియంత్రణ అవగాహన

11-04-2026 07:36 PM

కుమ్రంభీం ఆసిఫాబాద్,(విజయక్రాంతి): జిల్లా కేంద్రంలో ఔషధ నియంత్రణ, నియంత్రణ వ్యవస్థ బలోపేత దినోత్సవం సందర్భంగా అవగాహన కార్యక్రమం నిర్వహించారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు డ్రగ్ ఇన్‌స్పెక్టర్ అశ్విని ఆధ్వర్యంలో ఫార్మాసిస్టులు, మెడికల్ షాప్ యజమానులతో ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా డ్రగ్స్, గంజాయి వంటి నిషేధిత పదార్థాలపై నియంత్రణ అవసరాన్ని వివరించి, ఔషధాల సరైన వినియోగం, షెడ్యూల్డ్ మందుల నిబంధనలపై అవగాహన కల్పించారు.

వైద్యుల ప్రిస్క్రిప్షన్ లేకుండా మందులు విక్రయించరాదని డ్రగ్ ఇన్‌స్పెక్టర్ సూచించారు. కార్యక్రమం అనంతరం డ్రగ్స్ కంట్రోల్ క్విజ్, వ్యాసరచన పోటీల్లో విజేతలైన విద్యార్థులకు బహుమతులు అందజేశారు.కార్యక్రమంలో జిల్లా వైద్యాధికారి సీతారాం, డీడబ్ల్యూఓ భాస్కర్, ఈగిల్ టీం సభ్యుడు రమేష్ తదితరులు పాల్గొన్నారు.