1 June, 2026 | 4:21 PM

Breaking News

విద్యుత్ శాఖ నిర్లక్ష్యం   •   జొన్నల తూకం కాంటా కోసం కొట్లాడుతున్న రైతులు   •   అందరికీ ఉద్యోగం ఇవ్వడం ఎప్పటికీ సాధ్యం కాదు: TGPSC చైర్మన్   •   వరి ధాన్యం సాగులో దేశంలో తెలంగాణ మొదటి స్థానం   •   తెలంగాణ ఆవిర్భావ వేడుకలను ఘనంగా నిర్వహించాలి: ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్   •   తెలంగాణ అమరవీరులు, ఉద్యమకారుల హామీలపై సీఎం స్పష్టత ఇవ్వాలి   •   గిరిజాయి గ్రామంలో అగ్ని ప్రమాదం రెండు లక్షల నగదు ఆరు లక్షల ఆస్తి నష్టం.   •   బీఎంఎస్ఆర్యు రాష్ట్ర అధ్యక్షుడిగా పప్పుల సురేష్   •   డీజేలకు అనుమతి లేదు: ఎస్సై ప్రవీణ్ కుమార్   •   రైతులకు ఉచితంగా విత్తనాలు, ఎరువులు అందించాలి   •  

తెలంగాణ ఆవిర్భావ వేడుకలను ఘనంగా నిర్వహించాలి: ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్

01-06-2026 03:43 PM

సనత్‌నగర్,(విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించాలని మాజీమంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ పిలుపునిచ్చారు. సోమవారం వెస్ట్ మారేడ్ పల్లిలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ సనత్ నగర్ నియోజకవర్గ ముఖ్య నాయకులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జూన్ 2వ తేదీన తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవంను పురస్కరించుకుని నియోజకవర్గ పరిధిలోని అన్ని డివిజన్ లలో జెండాలు ఎగురవేసి వేడుకలను ఘనంగా జరపాలని చెప్పారు. డివిజన్ లలో ఉదయం  జెండాలను ఎగురవేసిన అనంతరం అమీర్ పేట లోని సత్యం థియేటర్ సర్కిల్ లో మాజీ కార్పొరేటర్ నామన శేషుకుమారి ఆధ్వర్యంలో ఉదయం 10.00 గంటలకు నిర్వహించే వేడుకలకు పార్టీ నాయకులు, కార్యకర్తలు భారీగా హాజరుకావాలని అన్నారు. జెండా ఆవిష్కరణ అనంతరం తెలంగాణ ఉద్యమకారులను సన్మానించనున్నట్లు తెలిపారు.