1 June, 2026 | 4:21 PM

Breaking News

విద్యుత్ శాఖ నిర్లక్ష్యం   •   జొన్నల తూకం కాంటా కోసం కొట్లాడుతున్న రైతులు   •   అందరికీ ఉద్యోగం ఇవ్వడం ఎప్పటికీ సాధ్యం కాదు: TGPSC చైర్మన్   •   వరి ధాన్యం సాగులో దేశంలో తెలంగాణ మొదటి స్థానం   •   తెలంగాణ ఆవిర్భావ వేడుకలను ఘనంగా నిర్వహించాలి: ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్   •   తెలంగాణ అమరవీరులు, ఉద్యమకారుల హామీలపై సీఎం స్పష్టత ఇవ్వాలి   •   గిరిజాయి గ్రామంలో అగ్ని ప్రమాదం రెండు లక్షల నగదు ఆరు లక్షల ఆస్తి నష్టం.   •   బీఎంఎస్ఆర్యు రాష్ట్ర అధ్యక్షుడిగా పప్పుల సురేష్   •   డీజేలకు అనుమతి లేదు: ఎస్సై ప్రవీణ్ కుమార్   •   రైతులకు ఉచితంగా విత్తనాలు, ఎరువులు అందించాలి   •  

తెలంగాణ అమరవీరులు, ఉద్యమకారుల హామీలపై సీఎం స్పష్టత ఇవ్వాలి

01-06-2026 03:41 PM

టీజీ ఉద్యమ నేత కూనూరు సంజయ్ దాస్ గౌడ్ డిమాండ్

చిట్యాల,(విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తెలంగాణ కోసం ప్రాణత్యాగం చేసిన అమరవీరుల కుటుంబాలు, ఉద్యమంలో పాల్గొన్న ఉద్యమకారులకు ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలుపై ముఖ్యమంత్రి స్పష్టమైన ప్రకటన చేయాలని తెలంగాణ రాష్ట్ర మలిదశ ఉద్యమకారుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కూనూరు సంజయ్ దాస్ గౌడ్ డిమాండ్ చేశారు. సోమవారం ఆయన మాట్లాడుతూ... తెలంగాణ ఉద్యమకారుల సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం కేశవరావు కమిటీ పేరుతో కాలయాపన చేయకుండా, ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను తక్షణమే అమలు చేయాలని కోరారు.

తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పోరాడిన వేలాది మంది ఉద్యమకారులు ఇప్పటికీ ప్రభుత్వ గుర్తింపు, సంక్షేమ పథకాల అమలు కోసం ఎదురుచూస్తున్నారని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రాణాలు అర్పించిన అమరవీరులు, ఉద్యమకారుల త్యాగాలు వృథా కాకూడదని పేర్కొన్నారు. స్వాతంత్ర్య ఉద్యమానికి ఇచ్చిన గౌరవం మాదిరిగానే తెలంగాణ ఉద్యమానికి కూడా ప్రభుత్వం అధికారిక గుర్తింపు ఇవ్వాలని కోరారు. తెలంగాణ ఉద్యమకారులకు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ముఖ్యమంత్రి అమలు చేస్తే ప్రజలు మరోసారి కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తారు.

అయితే హామీల అమలులో నిర్లక్ష్యం చేసి ఉద్యమకారులను మోసం చేస్తే రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తీవ్ర రాజకీయ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. అలాగే తెలంగాణ ఉద్యమంతో ఎలాంటి సంబంధం లేని వ్యక్తులు ఏర్పాటు చేస్తున్న సంఘాల పట్ల ఉద్యమకారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఉద్యమ చరిత్రను, ఉద్యమకారుల త్యాగాలను రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగించుకునే ప్రయత్నాలను తెలంగాణ ఉద్యమకారులు సమిష్టిగా తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అమరవీరుల కుటుంబాలు, ఉద్యమకారుల సంక్షేమాన్ని అత్యంత ప్రాధాన్యతగా తీసుకుని, ఇచ్చిన హామీలన్నింటినీ అమలు చేయాలని ఈ సందర్భంగా కూనూరు సంజయ్ దాస్ గౌడ్ విజ్ఞప్తి చేశారు.