వ్యవసాయ ఉత్పత్తుల మార్కెటింగ్ అవకాశాలపై అవగాహన సదస్సు
06-05-2026 07:30 PM
చైర్మన్ వేపూరి తిరుపమ్మ సుధీర్
కోదాడ,(విజయక్రాంతి): ప్రభుత్వము నిర్వహిస్తున్న 99 రోజుల కార్యచరణ ప్రజాపాలన - ప్రగతి ప్రణాళిక అమలు, రైతు వారోత్సవాలులో భాగముగా బుధవారము వ్యవసాయ ఉత్పత్తుల మార్కెటింగ్ అవకాశాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా చైర్మన్ వేపూరి తిరుపమ్మ సుధీర్ మాట్లాడుతూ ప్రభుత్వ పథకాల గురించి వివరించారు. రైతులు పండించిన పంటలను మార్కెట్ యార్డులలో విక్రయించడం వలన మంచి ధర పోందవచ్చునని, కోదాడ యార్కెట్ కమిటిని రెగ్యూలర్ మార్కెటుగా మార్చుటకు తమ వంతు కృషి చేస్తామని తెలిపినారు.






