7 July, 2026 | 6:46 PM

Breaking News

ఉన్ని పారిశ్రామిక సహకార సంఘం అధ్యక్షుడిగా కాసు గణేష్ ఏకగ్రీవ ఎన్నిక   •   గ్రామాల్లో ఘనంగా సీత్ల పండుగ సంబరాలు   •   పోడు రైతులకు న్యాయం చేయాలి: ఎమ్మెల్యే కోవ లక్ష్మి   •   ఆరేపల్లి రాహుల్ ను సన్మానించిన అడ్వకేట్స్   •   సీడబ్ల్యూఎస్‌ఎన్ పిల్లలందరూ భవిత కేంద్రంను సద్వినియోగం చేసుకోవాలి   •   సీసీ రోడ్ల పనులు ప్రారంభం   •   జూలై 10న రాష్ట్రవ్యాప్త విద్యాసంస్థల బంద్‌ను జయప్రదం చేయండి   •   విద్యార్థుల భవిష్యత్ తో చెలగాటమాడుతున్న ప్రైవేట్ పాఠశాలలు   •   "సర్" ప్రక్రియను ఎన్నికల సంఘం మార్గదర్శకాల ప్రకారం పారదర్శకంగా, నిబంధనలకు అనుగుణంగా నిర్వహించాలి   •   బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు నాయకత్వానికి ఏడాది.. రామాలయంలో ప్రత్యేక పూజలు   •  

ఎన్ఎస్ఎస్ ఆధ్వర్యంలో ఎయిడ్స్ పై అవగాహన

25-03-2025 08:20 PM

కామారెడ్డి అర్బన్ (విజయక్రాంతి): ప్రభుత్వ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల కామారెడ్డిలో నాలుగో రోజు ఎన్ఎస్ఎస్ ఒకటి, రెండు, మూడు యూనిట్ల ఆధ్వర్యంలో బొటానికల్ గార్డెన్ ను మంగళవారం శుభ్రపరిచారు. ఈ సందర్భంగా లింక్ వర్కర్ స్కీం ఉమ్మడి నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల విభాగం తరఫున హాజరైన జిల్లా రిసోర్స్ పర్సన్ జి సుధాకర్ వాలంటీర్లకు ఎయిడ్స్ పై అవగాహన కల్పించారు. ఎయిడ్స్ తగ్గింది, అంతేగాని పూర్తిగా నిర్మూలించబడలేదని అన్నారు.

నిర్మూలించుటకు వాలంటీర్లు అందరూ తమ వంతుగా వారి వారి గ్రామాల్లో ఎయిడ్స్ పై ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎన్ఎస్ఎస్ చైర్మన్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ విజయకుమార్, వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ కే కిష్టయ్య, ఐక్యూఏసి కోఆర్డినేటర్ అంకం జయప్రకాష్, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్లు డాక్టర్ పి రాజ గంభీర్ రావు, డాక్టర్ జి చంద్రశేఖర్ గౌడ్, డాక్టర్ బి శారద, వాలంటీర్లు పాల్గొన్నారు.