7 July, 2026 | 7:32 PM

Breaking News

ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని కలిసిన వివిధ గ్రామ సర్పంచులు   •   గట్టుదుద్దెనపల్లి సంఘం చైర్మన్ గా గంగుల రామ్ రెడ్డి   •   సర్ ప్రక్రియపై ఓటర్లకు అవగాహన కార్యక్రమం   •   నాగిరెడ్డిపేట్ గవర్నమెంట్ హాస్పిటల్లో డెలివరీల సంఖ్య పెంచాలి   •   17వ వార్షికోత్సవ వేడుకలకు ముస్తాబైన సుల్తానాబాద్ సాయిబాబా దేవాలయం   •   ఘనంగా ఎంఆర్పీఎస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు   •   అనగారిన వర్గాల... అభ్యున్నతి ఎమ్మార్పీఎస్ తోనే సాధ్యం   •   ఘనంగా ఎమ్మార్పీఎస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు   •   ఇందిరమ్మ ఇండ్ల వద్ద కరెంటు స్తంభాలు ఏర్పాటు   •   ఫర్టిలైజర్ దుకాణాల్లో టాస్క్ ఫోర్స్ తనిఖీలు   •  

ఉన్ని పారిశ్రామిక సహకార సంఘం అధ్యక్షుడిగా కాసు గణేష్ ఏకగ్రీవ ఎన్నిక

07-07-2026 06:44 PM

చిట్యాల,(విజయక్రాంతి): ఉన్ని పారిశ్రామిక సహకార సంఘం ఎన్నికల్లో చిట్యాల మండలం గుండ్రాంపల్లి గ్రామానికి చెందిన కాసు గణేష్ ఏకగ్రీవంగా అధ్యక్షుడిగా మంగళవారం ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా గుండ్రాంపల్లి గ్రామ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తూ, ఆయన ఎన్నిక గ్రామానికి గర్వకారణమని పేర్కొన్నారు. సంఘం నూతన కార్యవర్గంలో ఉపాధ్యక్షుడిగా కంకల బీరయ్య (ఎల్లంబావి), కార్యదర్శిగా కొండె వెంకటేష్ (ఏపూర్), కోశాధికారిగా దిందే ఆడవయ్య (కాట్రేవు) ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

డైరెక్టర్లుగా కంకల బుగ్గమ్మ, బండ కేతమ్మ (గుండ్రాంపల్లి), వస్పరి జహంగీర్ (అంతమ్మగూడెం), కొండె మహేష్ (వేలిమినేడు), బాలం జంగయ్య (ఎల్లంబావి) ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా నూతన అధ్యక్షుడు కాసు గణేష్‌తో పాటు కార్యవర్గ సభ్యులందరికీ పలువురు శుభాకాంక్షలు తెలియజేస్తూ, వారి నాయకత్వంలో సంఘం మరింత అభివృద్ధి సాధించి సభ్యుల సంక్షేమానికి కృషి చేయాలని ఆకాంక్షించారు. ఎన్నికల అధికారి పి. అండాలు సమక్షంలో ఎన్నికలు నిర్వహించారు.