7 July, 2026 | 7:23 PM

సీడబ్ల్యూఎస్‌ఎన్ పిల్లలందరూ భవిత కేంద్రంను సద్వినియోగం చేసుకోవాలి

07-07-2026 06:34 PM

నేరేడుచర్ల ఎంఈవో బాలు

నేరేడుచర్ల,(విజయక్రాంతి): నేరేడుచర్ల మండలం కేంద్రంలోని చింతబండ ప్రాథమిక పాఠశాలలో గల భవిత కేంద్రంలో ప్రత్యేక అవసరాలు గల పిల్లలకు అందిస్తున్న సేవలను మండల విద్యాధికారి ఎం. బాలు మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండలంలోని సీడబ్ల్యూఎస్‌ఎన్ పిల్లలందరూ ఈ క్యాంపును సద్వినియోగం చేసుకోవాలని, అక్కడ ప్రతి మంగళవారం నిర్వహిస్తున్న ఫిజియోథెరపీ క్యాంపును తనిఖీ చేసి,కేంద్రంలో సేవలు అందిస్తున్న సిబ్బందిని అభినందించారు.